LOADING...
Countries Where Holi Festival Is Celebrated: ప్రపంచవ్యాప్తంగా రంగుల హోలీ సంబరాలు
ప్రపంచవ్యాప్తంగా రంగుల హోలీ సంబరాలు

Countries Where Holi Festival Is Celebrated: ప్రపంచవ్యాప్తంగా రంగుల హోలీ సంబరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోలీ హిందువుల ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రత్యేక స్థానం పొందిన పవిత్ర పండుగ. రంగుల సంబరంగా పేరుపొందిన ఈ ఉత్సవాన్ని భారత్‌లో అపారమైన ఆనందంతో నిర్వహిస్తారు. అయితే హోలీ భారతదేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఎన్నో దేశాల్లో భారతీయులు, స్థానికులు కలిసి ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

#1

నేపాల్

నేపాల్‌లో హోలీని "ఫాగు పూర్ణిమ"గా పిలుస్తారు. అక్కడ కూడా హోలికాదహనం నిర్వహించి, మరుసటి రోజు రంగుల ఆటలతో సంబరాలు చేస్తారు. సంప్రదాయ గీతాలు, జానపద నృత్యాలు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హిందూ, బౌద్ధ సముదాయాలు కలిసి పాల్గొనడం ఈ పండుగకు ప్రత్యేకతను అందిస్తుంది.

#2

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‌లో హోలీని "డోల్ పూర్ణిమ" లేదా "వసంత ఉత్సవం"గా నిర్వహిస్తారు. రాధా-కృష్ణుల ఊరేగింపులు, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ పండుగను ఆచరిస్తారు. మతసామరస్యానికి ప్రతీకగా ఈ వేడుకను భావిస్తారు.#3పాకిస్తాన్ పాకిస్తాన్‌లో ముఖ్యంగా సింధ్ ప్రాంతంలోని హిందూ సమాజం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, రంగులతో ఆనందోత్సవాలు జరుపుకుంటుంది. పరస్పరం స్వీట్లు పంచుకోవడం ద్వారా ఐక్యతను చాటుకుంటారు.

Advertisement

#4

మారిషస్

మారిషస్‌లో హోలీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పండుగ. భారత సంతతికి చెందిన ప్రజలు "హోలీ మేళా" పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, సంగీత ప్రదర్శనలు నిర్వహిస్తారు.#5ఫిజి ఫిజిలో హోలీని "ఫాగ్వా" అని అంటారు. ఇండో-ఫిజియన్ సమాజం రంగుల ఆటలతో పాటు భక్తి గీతాలు పాడుతూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది.#6ట్రినిడాడ్, టొబాగో ట్రినిడాడ్, టొబాగో దేశాల్లో కూడా హోలీని "ఫాగ్వా" పేరుతో జరుపుకుంటారు. సంప్రదాయ పాటలు, రంగుల చల్లకట్టుతో ఉత్సాహభరితంగా పండుగ సాగుతుంది.

Advertisement

#7

యునైటెడ్ కింగ్‌డమ్

లండన్,లీసెస్టర్ వంటి నగరాల్లో భారతీయ సమాజం భారీ స్థాయిలో హోలీ వేడుకలు నిర్వహిస్తుంది. సంగీతం,నృత్యం,భారతీయ వంటకాల ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.#8అమెరికా, కెనడా అమెరికా,కెనడా దేశాల్లోని అనేక నగరాల్లో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా ఉటాలోని స్పానిష్ ఫోర్క్ ప్రాంతంలోని రాధాకృష్ణ ఆలయంలో భారీ స్థాయిలో ఉత్సవం నిర్వహిస్తారు. న్యూయార్క్,కాలిఫోర్నియా నగరాల్లో కూడా వేలాది మంది పాల్గొంటారు.#9ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిడ్నీ,మెల్‌బోర్న్ నగరాల్లో హోలీ వేడుకలు వైభవంగా జరుగుతాయి. అలాగే దక్షిణాఫ్రికాలో డర్బన్, జోహన్నెస్‌బర్గ్ ప్రాంతాల్లో భారతీయ సమాజం రంగుల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తుంది. ఇలా హోలీ పండుగ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబిస్తోంది. దేశాలు వేర్వేరు అయినా,రంగుల ఆనందం మాత్రం అందరినీ ఒకటిగా కట్టిపడేస్తోంది.

Advertisement