Ragi Appalu: రాగిపిండితో క్రిస్పీ అప్పాలు.. పాకం అవసరం లేదు, 15 నిమిషాల్లో రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో తరచూ స్వీట్లు, హాట్ వంటకాలు తయారు చేస్తుంటాం. కానీ ఎప్పటికప్పుడు అదే రకమైన మిఠాయిలు కాకుండా కాస్త కొత్తగా ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే ఈ రెసిపీ మీ కోసం. ఎంతో రుచికరంగా, క్రిస్పీగా తయారయ్యే రాగి అప్పాలు ఒకసారి చేసి చూడండి. పాకం పట్టాల్సిన అవసరం లేకుండా సులభంగా చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ స్వీట్‌ను ఒకసారి తయారు చేస్తే సుమారు 20 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.
Details
కావాల్సిన పదార్థాలు
రాగిపిండి - ఒకటిన్నర కప్పులు గోధుమపిండి - అర కప్పు ఎండుకొబ్బరి ముక్కలు - పావు కప్పు యాలకులు - 6 ఉప్పు - చిటికెడు నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు బెల్లం తురుము - ఒక కప్పు నెయ్యి - కొద్దిగా నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
Details
తయారీ విధానం
1.ముందుగా ఎండుకొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో ఈ కొబ్బరి ముక్కలతో పాటు ఆరు యాలకులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. 2.ఒక మిక్సింగ్ బౌల్‌లో రాగిపిండి ఒకటిన్నర కప్పులు, గోధుమపిండి అర కప్పు వేసి కలపాలి. ఇందులో గ్రైండ్ చేసిన కొబ్బరి-యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. 3.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో ఒక కప్పు బెల్లం తురుము, అర కప్పు నీళ్లు వేసి మీడియం మంటపై కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేయాలి. పాకం పట్టాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.
Details
తయారీ విధానం1/2
4. ఈ బెల్లం నీటిని ముందుగా సిద్ధం చేసుకున్న పిండిమిశ్రమంలో వేసి మీడియం సాఫ్ట్‌గా ఉండేలా కలపాలి. తర్వాత మూత పెట్టి సుమారు 15 నిమిషాలు పక్కన ఉంచాలి. 5. 15 నిమిషాల తరువాత పిండిని మరోసారి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ లేదా బటర్ పేపర్ మీద కొద్దిగా నెయ్యి రాసి ఒక్కో ఉండను ఉంచి చేతితో నెమ్మదిగా ఒత్తుతూ అప్పాల ఆకారంలో చేసుకోవాలి. 6. మరోవైపు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తయారు చేసిన అప్పాలను జాగ్రత్తగా వేసి ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి.
Details
ఇలా చేస్తే నోరూరించే, క్రిస్పీ రాగి అప్పాలు రెడీ
7. తర్వాత మీడియం మంటపై రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. 8. వేయించిన తరువాత ప్లేట్‌లోకి తీసి సర్వ్ చేయాలి. ఇలా చేస్తే నోరూరించే, క్రిస్పీ రాగి అప్పాలు సిద్ధం అవుతాయి. వీటిని ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ ఉంచితే సుమారు 20 రోజుల పాటు తాజాగా ఉంటాయి.