LOADING...
Cucumber mutton: దోసకాయ మటన్ కూర.. ఒక్కసారి తింటే వావ్ అనాల్సిందే!
దోసకాయ మటన్ కూర.. ఒక్కసారి తింటే వావ్ అనాల్సిందే!

Cucumber mutton: దోసకాయ మటన్ కూర.. ఒక్కసారి తింటే వావ్ అనాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2026
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

దోసకాయతో మటన్ కూరా? వినడానికి కొత్తగా అనిపించినా, ఒకసారి ఈ కాంబినేషన్‌తో వండి రుచి చూస్తే మాత్రం ముద్ద ముద్దకు "వావ్" అనిపించే రుచిని ఆస్వాదిస్తారు. కాబట్టి ఈసారి సాధారణ మటన్ కూరకు బదులుగా దోసకాయ మటన్ కూరను ట్రై చేయండి. ఇప్పుడు ఈ ప్రత్యేక రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం వివరంగా తెలుసుకుందాం.

Details

కావాల్సిన పదార్థాలు

పావు కిలో మటన్ ఒక పెద్ద దోసకాయ 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు కారం 1 టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా సరిపడా నూనె రుచికి తగినంత ఉప్పు

Details

తయారీ విధానం

ముందుగా స్టవ్‌పై చిన్న పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఆపై మటన్ ముక్కలను వేసి బాగా వేయించాలి. సుమారు 10 నిమిషాల తర్వాత పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మటన్ మృదువుగా ఉడికేలా చేయాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలను జోడించి గరిటతో బాగా కలపాలి. మళ్లీ స్టవ్‌పై ఉంచి సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి.

Advertisement

Details

తయారీ విధానం1/2

చివరగా కారం, ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. పులుసు ఎక్కువగా కావాలనుకునేవారు ఒక గ్లాస్ నీరు పోసి మరో 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మటన్ పూర్తిగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ నుంచి దించాలి. అంతే... వేడి వేడి దోసకాయ మటన్ కూర రెడీ! రుచికరమైన ఈ వంటకం అన్నం లేదా రోటీలతో అద్భుతంగా సరిపోతుంది.

Advertisement