Loading...
Pre-Booked Funeral Packages: బతికుండగానే అంత్యక్రియలు బుక్‌ చేసుకోవాలంట...విచిత్రం కాకపోతే మరేంటి
బతికుండగానే అంత్యక్రియలు బుక్‌ చేసుకోవాలంట...విచిత్రం కాకపోతే మరేంటి

Pre-Booked Funeral Packages: బతికుండగానే అంత్యక్రియలు బుక్‌ చేసుకోవాలంట...విచిత్రం కాకపోతే మరేంటి

వ్రాసిన వారు Balachander Sharma
Nov 28, 2026
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా టికెట్‌ కావచ్చు.. విమాన ప్రయాణం కావచ్చు.. హోటల్‌ రూమ్‌ కావచ్చు.. ముందుగానే బుక్‌ చేసుకోవడం మనకు అలవాటే. కానీ ఇప్పుడు సొంత అంత్యక్రియల కోసం కూడా ముందే ప్యాకేజీ బుక్‌ చేసుకునే సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీకి చెందిన 'మోక్ష వాయేజ్‌' అనే స్టార్టప్‌ ఈ కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌లో ఈ సేవలను ప్రదర్శించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపై పడింది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. దీని వెనుక ఉద్దేశం మాత్రం చివరి సమయంలో కుటుంబ సభ్యులపై పడే హడావుడిని తగ్గించడమే.

Details

రూ.6 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ప్యాకేజీలు

నమో గంగే వెల్నెస్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ.. వ్యక్తుల అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా వివిధ రకాల అంత్యక్రియల ప్యాకేజీలను అందిస్తోంది.

వీటి ధరలు రూ.6,000 నుంచి రూ.1.5 లక్షల వరకు ఉన్నాయి. ఒకసారి ప్యాకేజీ తీసుకుంటే అంత్యక్రియల ఏర్పాట్ల నుంచి మృతదేహాన్ని తరలించే వాహనం, పాడె మోసేవారు, దహన సంస్కారాలు, అనంతరం నిర్వహించే కర్మకాండల వరకు అవసరమైన సేవలను కంపెనీ సమన్వయం చేస్తుంది.

విదేశాల్లో మరణించిన వారి పార్థివదేహాన్ని భారత్‌కు తీసుకురావాల్సిన పరిస్థితుల్లో రవాణా ఏర్పాట్లను కూడా అదనపు సేవగా పొందే అవకాశం ఉంది.

Details

అమెరికాలో ఇప్పటికే భారీ మార్కెట్

ఇలాంటి సేవలు మన దగ్గర కొత్తగా అనిపించినా.. అమెరికాలో అంత్యక్రియల పరిశ్రమ చాలాకాలంగా పెద్ద వ్యాపారంగా కొనసాగుతోంది.

అక్కడ ఈ రంగం విలువ ఏడాదికి సుమారు 20.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇందులో దాదాపు 75 శాతం వాటా చిన్న కుటుంబ వ్యాపారాలదే.

మరోవైపు Service Corporation International (SCI) ఒక్కటే సుమారు 17 శాతం మార్కెట్‌ను కలిగి ఉంది.

2019లో 12 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఆ సంస్థ ప్రీ-బుకింగ్‌ ప్యాకేజీల విలువ 18 బిలియన్‌ డాలర్లకు చేరడం ఈ సేవలకు ఉన్న డిమాండ్‌ను చూపిస్తోంది.

ADVERTISEMENT

Details

ఇండియాలోనూ మొదలైన అడ్వాన్స్‌ బుకింగ్

ఇప్పుడు ఈ ఆలోచన నెమ్మదిగా భారత్‌లోనూ అడుగుపెడుతోంది. మోక్ష వాయేజ్‌ ప్రకారం ఇప్పటికే 300 మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

అయితే ఈ కాన్సెప్ట్‌పై ప్రజల అభిప్రాయాలు మాత్రం రెండుగా విడిపోతున్నాయి.

చివరి సమయంలో కుటుంబ సభ్యులు డబ్బు, ఏర్పాట్ల గురించి ఆలోచించకుండా ముందే అన్నీ ప్లాన్‌ చేసుకోవడం మంచిదని కొందరు భావిస్తున్నారు.

మరికొందరికి మాత్రం మరణం చుట్టూ ఉండే కుటుంబ అనుబంధాలను ఇలా ప్రొఫెషనల్‌ సేవగా మార్చడం అంతగా నచ్చడం లేదు.

చివరకు ఇది భారతీయ సమాజంలో ఎంతవరకు ఆదరణ పొందుతుందో కాలమే చెప్పాలి.

ADVERTISEMENT