డెలికేట్ డంపింగ్ గురించి మీకు తెలుసా? కొత్తగా ట్రెండ్ అవుతున్న బ్రేకప్ వ్యూహం గురించి తెలుసుకోండి.
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రేకప్ లు ప్యాచప్ లు కామన్ అయిపోయాయి. ప్యాచప్ అయినపుడు మనసంతా ఎంత ఉల్లాసంగా ఉంటుందో, బ్రేకప్ అయినపుడు మనసంతా అంత ఉదాసీనంగా ఉంటుంది.
ప్రస్తుతం డెలికేట్ డంపింగ్ అనే బ్రేకప్ వ్యూహం, సమాజంలో ట్రెండ్ అవుతోంది. దాని వివరాలేంటో చూద్దాం.
డెలికేట్ డంపింగ్ అంటే అవతలి వాళ్ళు మీతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటారు. కానీ మీకు ఆ విషయం చెప్పరు. ముందుగా మాటలు తగ్గిస్తారు. ఆ తర్వాత కాల్స్ తగ్గిస్తారు.
ఇలా అన్నీ తగ్గించేసి మీకు మీరుగా అవతలి వాళ్లతో బ్రేకప్ చేయించేలా చేస్తారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా ఇది నిజం. బంధాన్ని వాళ్ళు వద్దనుకుని ఆ మాటను మీచేత చెప్పించేలా చేస్తారు.
Details
ఈ బ్రేకప్ వ్యూహం అమలు చేయడానికి గల కారణాలు
బ్రేకప్ అనే మాట తాము చెప్పలేదని, అవతలి వాళ్ళే చెప్పారని మనసుకు సర్ది చెప్పుకోవడానికి, అవతలి వారిని మోసం చేసాననే బాధ మనసులో ఉండకూడదని ఇలా చేస్తారు.
ఈ డెలికేట్ డంపింగ్ ఉచ్చులో పడకుండా ఉండాలి. నీకు నాకు సెట్ కావట్లేదు, విడిపోదాం అని చెప్పకుండా, విడిపోవాలన్న కోరికను పరోక్షంగా తమ చేష్టల ద్వారా తెలియజేస్తారు.
ఈ ప్రాసెస్ లో తాము మాత్రం నిజాయితీ పరులైనట్లు ఫీలవుతారు. ఇలాంటి వ్యూహంలో పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి.
మీ భాగస్వామి ప్రవర్తనలో సడెన్ గా మార్పు వస్తే, మాటలు తగ్గిస్తే, మీతో ఉన్నప్పుడు సౌకర్యంగా లేకపోతే ఏదో ఉందని గ్రహించండి.