
Insurance: ధూమపానం అలవాటు ఉందా..? బీమా కంపెనీకి చెప్పకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ధూమపానం చేసే చాలామంది తరచూ ఒకటే మాట అంటుంటారు. 'ఇదే చివరిది' అంటారు. కానీ మానరు. మరుసటి రోజే మళ్లీ సిగరెట్ చేతిలోకి తీసుకుంటారు.
దీనివల్ల శరీరానికి తీరని హాని కలుగుతుంది. కానీ ఈ అలవాటు ఒకవేళ బీమా పాలసీ తీసుకునేటప్పుడు దాచిపెడితే.. అది మరింత పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది.
బీమా తీసుకునేటప్పుడు నిజాయితీ తప్పనిసరి
మీకు ధూమపానం చేసే అలవాటు ఉందా? అయితే బీమా కంపెనీలకు దాన్ని స్పష్టంగా తెలియజేయాలి.
ఒకవేళ మీరు అది దాచిపెడితే.. తర్వాత పలు రకాల ఇబ్బందులు ఎదురవవచ్చు.
ఆరోగ్య సమాచారం బీమా పాలసీలో పూర్తి స్పష్టంగా ఉండాలి. ధూమపానం లాంటి అలవాట్లను దాచడం వల్ల బీమా క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Details
ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది
ధూమపానం చేసే వారికి సాధారణంగా బీమా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా - స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి బీమా కంపెనీలు ఎక్కువ రిస్క్‌గా చూస్తాయి.
అందుకే ఎక్కువ బీమా చార్జ్ వసూలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రీమియం రెట్టింపు కావచ్చు. మెడికల్ చెకప్ ద్వారా దీనిని నిర్ధారించుకుంటారు.
హెల్త్ బీమాలో కొంత సడలింపు ఉంది
ధూమపానం మానిన వారు అయితే.. 12 నుంచి 24 నెలల పాటు పొగాకు వాడకపోయినట్లు డాక్టర్ల సర్టిఫికేట్ సమర్పిస్తే, తదుపరి పాలసీ పునరుద్ధరణ సమయంలో ప్రీమియం తగ్గించే అవకాశం ఉంటుంది.
అంటే పూర్తిగా మానేస్తే మీకు ప్రయోజనం ఉంటుంది.
Details
టర్మ్ పాలసీలో మాత్రం మార్పు లేదు
మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ధూమపానం మానినా, మీ ప్రీమియంలో మార్పు రావడం చాలా అరుదు. ఎందుకంటే టర్మ్ పాలసీలో ప్రీమియం ఫిక్స్‌డ్ గా ఉంటుంది. ఒక్కసారి నిర్ణయించాక దానిని మార్చడం కష్టమే.
అసత్య సమాచారం కంటే నష్టం మరొకటి లేదు
మీరు పాలసీ తీసుకునేటప్పుడు ధూమపానం చేస్తారని చెప్పకుండా దాచిపెడితే.. భవిష్యత్తులో మీకు లేదా మీ కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముంది.
బీమా కంపెనీలు మరణానంతరం కారణాలు తెలుసుకునేందుకు పూర్తి విచారణ చేస్తాయి. ధూమపానం వల్లే మృతిచెందినట్లు తేలితే, మీరు వివరాలు దాచినట్టు అయితే.. బీమా క్లెయిమ్ తిరస్కరణ ఖాయం.
Details
నికోటిన్ పరీక్షలు తప్పవు
పాలసీ జారీ ముందు చాలాబీమా కంపెనీలు మెడికల్ టెస్టులు చేస్తాయి. ఇందులో నికోటిన్ లేదా పొగాకు ఉనికిని రక్తం, మూత్రం, వెంట్రుకల ద్వారా పరీక్షిస్తారు.
తద్వారా మీరు ధూమపానం చేస్తున్నారా లేదా అన్న విషయం స్పష్టమవుతుంది.
కొన్ని సందర్భాల్లో సిగరెట్ అలవాటు వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యలే మృత్యుకి కారణమవుతే, బీమా మొత్తం పొందే అవకాశం పూర్తిగా కోల్పోతారు.