పిడుదు పురుగుల ద్వారా సోకే ప్రాణాంతక పోవాసన్ వైరస్ గురించి తెలుసుకోండి
పిడుదు పురుగుల(టిక్స్) ద్వారా సోకే పోవాసన్ వైరస్ కారణంగా ఈ సంవత్సరం అమెరికాలో మొట్టమొదటి మరణం సంభవించింది. అమెరికాలోని మెయిన్ ప్రాంతానికి చెందిన 58సంవత్సరాల వ్యక్తి, పోవాసన్ వైరస్ కారణంగా చనిపోయాడు. ఈ నేపథ్యంలో పోవాసన్ వైరస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 2015నుండి మెయిన్ రాష్ట్రంలో 15పోవాసన్ కేసులు నమోదయ్యాయి. 2022లో నలుగురు వ్యక్తులకు పోవాసన్ వైరస్ సోకింది. ఇప్పుడు మూడవ మరణం సంభవించింది. పోవాసన్ వైరస్ అంటే: పోవాసన్ వైరస్ సోకిన పిడుదు పురుగులు మనుషులకు కుట్టడం ద్వారా ఈ వైరస్ మనుషులకు అంటుకుంటుంది. ఈ పిడుదు పురుగులు జింకలు, కుందేళ్ళ చర్మం మీద నివాసం ఏర్పర్చుకుంటాయి.
పొవాసన్ లక్షణాలు
మొట్టమొదటిసారిగా ఒంటారియా రాష్ట్రం పొవాసన్ ప్రాంతంలో ఈ వైరస్ ను కనుగొన్నారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. సాధారణంగా ఈ పిడుదు పురుగులు ఉత్తర అమెరికా ఖండంలో వసంత కాలం చివరి నుండి వర్షాకలం మధ్య వరకు కనిపిస్తాయి. అయితే ఈ ప్రాంతం వెలుపల కూడా పొవాసన్ కేసులు నమోదయ్యాయి. లక్షణాలు: పొవాసన్ సోకిన వారిలో లక్షణాలు తొందరగా కనిపించవు. కొంతమందిలో మాత్రం పిడుదు పురుగు కుట్టిన వారం రోజుల తర్వాత జ్వరం, తలనొప్పి, వాంతులు, బలహీనత వంటివి కనిపిస్తాయి. మూర్ఛ, మెదడు వాపు, మెనింజైటిస్ కూడా కొంతమందిలో కనిపిస్తుంది. చాలా తక్కువ సందర్భాల్లో కన్ఫ్యూజన్, మాట్లాడటంలో ఇబ్బంది ఇంకా అనేక ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
పొవాసన్ వైరస్ ట్రీట్ మెంట్
పొవాసన్ కు వైరస్ సరైన చికిత్స లేదు. లక్షణాలను బట్టి వైద్యులు మెడిసిన్స్ ఇస్తారు. పొవాసన్ రాకుండా ఉండాలంటే: పిడుదు పురుగుల నుండి దూరంగా ఉండడమే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. పిడుదు పురుగులు ఉండే ప్రాంతాలకు వెళ్ళినపుడు చేతులు కనిపించకుండా బట్టలతో పూర్తిగా కప్పేసుకోవాలి. షార్ట్స్ వేసుకోకుండా ట్రోజర్స్ ధరిస్తే మంచిది. పిడుదు పురుగులు చర్మం మీదకు చేరినట్లయితే వాటిని జాగ్రత్తగా తీసివేయండి. ఆ తర్వాత సబ్బుతో చర్మాన్ని శుభ్రంగా శుభ్రపరుచుకోండి.