
ముఖంపై ఫేక్ మచ్చలు పెట్టుకునే ట్రెండ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ముఖంపై మచ్చలు ఉండటం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అసలు ఎలాంటి చిన్న మచ్చ కూడా లేకుండా ఉండాలని చాలామంది కోరుకుంటారు.
కానీ మీకిది తెలుసా? ముఖంపై కావాలని మచ్చలు పెట్టుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. దాని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా సూర్యరశ్మి ఎక్కువ పడిన కారణంగా ముఖంపై మరీ చిన్న సైజులో గోధుమ రంగులో మచ్చలు ఏర్పడుతుంటాయి. అతినీల లోహిత కిరణాల వల్ల మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడంతో అలాంటి మచ్చలు ఏర్పడతాయి.
ఈ మచ్చలను ముఖంపై మేకప్ సాయంతో వేసుకుంటున్నారు. అమెరికాలో ఇదొక ట్రెండ్ గా మారింది.
ఇండియాలో ఆలియా భట్, జాన్వీ కపూర్ వంటి సెలెబ్రిటీలు ఫేక్ మచ్చలతో ఫోటోలు దిగి తమ ఇన్స్ టాలో పంచుకున్నారు.
Details
టిక్ టాక్ లో మొదలైన ట్రెండ్
టిక్ టాక్ లో మేకప్ లేకుండా ఫోటోలు దిగడమనే ట్రెండ్ మొదలైంది. మొదట్లో బ్రిటిష్ బ్యూటీ ఇన్ ఫ్ల్యూయన్సర్ సిడ్నీ, ఫేక్ మచ్చలు వేసుకుని టిక్ టాక్ లో కనిపించింది.
అక్కడి నుండి ఫేక్ మచ్చలున్న ఫోటోలను అందరూ అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు.
మచ్చలు మాత్రమే కాదు, గతంలో డార్క్ సర్కిల్స్ కలిగి ఉండటాన్ని కూడా సెలెబ్రేట్ చేసుకున్నారు. కావాలని మరీ మేకప్ తో డార్క్ సర్కిల్స్ ని వేసుకున్నారు.
ఇలాంటి ఫేక్ మచ్చలని సృష్టించడానికి మేకప్ సాధనాల్లో స్టెన్సిల్ పనిచేస్తాయి. లిక్విడ్ ఐబ్రో పెన్సిల్, గోధుమ రంగు కాటుక, గోధుమ రంగు ఐ లైనర్ సాయంతో ఫేక్ మచ్చలను ముఖంపై పెట్టుకోవచ్చు.