హలీవుడ్ నటి గాల్ గాడోట్ కి ఆలియా తెలుగు పాఠాలు: వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆలియా భట్.. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆలియా, ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది.
ఆ మధ్య బ్రహ్మాస్త్రం ప్రమోషన్లలో హైదరాబాద్ వచ్చినపుడు తనకు తెలిసిన తెలుగులో అందరితో మాట్లాడింది.
అయితే ఇప్పుడు హాలీవుడ్ నటి గాల్ గాడోట్ కి ఆలియా భట్ తెలుగు నేర్పిస్తోంది.
ఆలియా, గాల్ గాడోట్ కలిసి హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. ఆగస్టు 11నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా హార్ట్ ఆఫ్ స్టోన్ అందుబాటులో ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొన్న ఆలియాభట్, అందరికీ నమస్కారం అంటూ గాల్ గాడోట్ కి నేర్పించింది. ఆమె కూడా ఆలియా అన్న మాటలను తిరిగి పలికింది.
Details
మీకు నా ముద్దులు అంటూ తెలుగు నేర్పే ప్రయత్నం
అంతేకాదు మీకు నా ముద్దులు అంటూ ఆలియా నేర్పిస్తుంటే పలకడానికి గాల్ గాడోట్ ప్రయత్నించింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సమయంలో నేర్చుకున్న తెలుగును హాలీవుడ్ నటికి నేర్పించే ప్రయత్నం చేసింది.
ఈ వీడియోను చూసిన వారందరూ, తెలుగు సినిమాల్లో ఆలియా నటిస్తే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు. మరి ప్రేక్షకుల కోరికను ఆలియా ఎప్పుడు తీరుస్తుందో చూడాలి.
అదలా ఉంచితే, ఆలియా, రణ్ వీర్ జంటగా నటించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గాల్ గాడోట్ కి తెలుగు నేర్పిస్తున్న ఆలియా భట్
Alia Bhatt teaching Telugu to Gal Gadot was not on my 2023 Bingo card pic.twitter.com/nsr7UJfwIL
— sagar (@alianator07) August 7, 2023