Page Loader
Birds: పక్షులు చెట్టు కొమ్మలపై నిద్రపోతున్నప్పుడు నేలమీద ఎందుకుపడవో తెలుసా?.. కారణమిదే! 
పక్షులు చెట్టు కొమ్మలపై నిద్రపోతున్నప్పుడు నేలమీద ఎందుకుపడవో తెలుసా?.. కారణమిదే!

Birds: పక్షులు చెట్టు కొమ్మలపై నిద్రపోతున్నప్పుడు నేలమీద ఎందుకుపడవో తెలుసా?.. కారణమిదే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2024
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెట్లు, ప్రకృతి, పక్షులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా పక్షులు, చెట్ల కొమ్మలపై సురక్షితంగా నిద్రపోతాయి. నిద్రలో జారి పడే ప్రమాదం వాటికి ఎలా ఉండదనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. మనలో చాలా మందికి మంచం మీద నిద్రిస్తుండగా కిందపడిన అనుభవం ఉంది. అయితే పక్షులు మాత్రం చెట్లపై నిద్రించినప్పుడు జారి పడవు. పక్షులు నిద్ర సమయంలో తమ మెదడును సగ భాగం మాత్రమే విశ్రాంతి తీసుకునేలా నియంత్రించుకుంటాయి. ఇది వారికి ఒక కన్నుతో నిద్రిస్తాయి. అంటే ఒకవైపు మెదడు అజాగ్రత్తగా ఉంటే, మరోవైపు విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల పక్షులు ప్రమాదాల నుంచి కూడా అప్రమత్తంగా ఉంటాయి. పైగా పక్షులు తమ పాదాల నిర్మాణం వల్ల కూడా సురక్షితంగా ఉంటాయి.

Details

పక్షుల పాదాలకు  ప్రత్యేకత

పక్షుల పాదాలు ఒక ప్రత్యేకమైన రీతిలో పనిచేస్తాయి. అవి చెట్టు కొమ్మల మీద నిద్రపోతున్నప్పుడు, పక్షి శరీరం నిద్రలో ఉన్నప్పటికీ పాదాల వేళ్లు కొమ్మను గట్టిగా పట్టుకుంటాయి. ఈ గడ్డు పట్టుకు కారణం, వారి పాదాల నిర్మాణం తాళంలా పని చేస్తుంది. అందువల్లనే పక్షులు చెట్టుపై సురక్షితంగా ఉంటాయి. పక్షులు నిద్రపోతున్నప్పుడు కూడా వారి శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. ప్రత్యేకంగా ఒక కన్ను తెరిచి ఉండటం, పాదాల గట్టిపట్టు అనే అంశాలు పక్షులను రక్షిస్తాయి.