LOADING...
#InternationalYogaDay: యోగా సమయంలో ఫ్యాన్ వాడుతున్నారా? చెమట ఆగితే శరీరంలో ఏమవుతుందో తెలుసా?
యోగా సమయంలో ఫ్యాన్ వాడుతున్నారా? చెమట ఆగితే శరీరంలో ఏమవుతుందో తెలుసా?

#InternationalYogaDay: యోగా సమయంలో ఫ్యాన్ వాడుతున్నారా? చెమట ఆగితే శరీరంలో ఏమవుతుందో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజుల్లో ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ప్రశాంతత కోసం కూడా చాలా మంది ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం వంటి సాధనలు చేస్తున్నారు. యోగాను సాధారణంగా ప్రశాంతమైన ఆరుబయట వాతావరణంలో, బాల్కనీ లేదా మేడపై చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తారు. అయితే నగరాల్లో స్థలాభావం, దోమల సమస్య వంటి కారణాల వల్ల చాలా మంది తమ ఇళ్లలోపలే యోగా చేయాల్సి వస్తోంది. గదిలో యోగా చేసే సమయంలో ఉక్కపోతగా అనిపించడం లేదా ఎక్కువగా చెమటలు పట్టడం వల్ల చాలామంది ఫ్యాన్ లేదా ఏసీని ఆన్ చేసుకుంటారు. అయితే యోగా లేదా ప్రాణాయామం చేసేటప్పుడు ఫ్యాన్ లేదా ఏసీ వాడటాన్ని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

వివరాలు

చర్మాన్నిచల్లబరస్తుంది

నిపుణుల అభిప్రాయం ప్రకారం యోగా లేదా ప్రాణాయామం చేస్తున్న సమయంలో శరీరం లోపల వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి కారణంగా శరీరంలోని వ్యర్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లే సహజ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనిని ఒక సహజ డీటాక్స్ ప్రక్రియగా పేర్కొంటారు. అయితే ఫ్యాన్ లేదా ఏసీ నుంచి వచ్చే చల్లని గాలి చర్మాన్ని చల్లబరుస్తుంది. దీంతో శరీరానికి పట్టాల్సినంత చెమట పట్టకపోవచ్చు. ఫలితంగా శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లే ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల కారణంగా చాలా మంది రోజంతా ఫ్యాన్లు లేదా ఏసీల కిందే గడుపుతుంటారు.

వివరాలు

గాలి ప్రసరణ మెరుగ్గా కొనసాగిస్తుంది

కనీసం యోగా చేసే అరగంట లేదా గంటసేపు అయినా శరీరానికి సహజంగా చెమట పట్టే అవకాశం ఇవ్వాలని ఆయన సూచిస్తున్నారు. లేకపోతే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లే అవకాశం తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. గదిలో యోగా చేస్తున్నవారు ఫ్యాన్ ఆన్ చేయకుండా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సహజ గాలి గదిలోకి ప్రవేశించి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల గాలి ప్రసరణ మెరుగ్గా కొనసాగుతుంది. ఫ్యాన్ లేకుండా యోగా చేసినప్పుడు శరీరానికి ఎక్కువగా చెమట పడుతుందని, ఆ చెమట ద్వారా శరీరం డీటాక్స్ కావడానికి సహాయపడుతుందని డాక్టర్ పేర్కొంటున్నారు.

Advertisement

వివరాలు

ఒంటి దుర్వాసనలు తగ్గుతాయి

శరీరం లోపల పరిశుభ్రత పెరగడంతో పాటు ఒంటి దుర్వాసనలు కూడా తగ్గుతాయని, రోజంతా మరింత ఫ్రెష్‌గా, ఉత్సాహంగా అనిపిస్తుందని ఆయన చెబుతున్నారు. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లే ప్రక్రియలో చెమట కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, యోగా లేదా ప్రాణాయామం చేసేటప్పుడు వీలైనంత వరకు ఫ్యాన్లు లేదా ఏసీలు ఉపయోగించకుండా సాధన చేయాలని ఆయన సూచిస్తున్నారు.

Advertisement