LOADING...
Health Benefits of Garlic : వెల్లుల్లిని తక్కువ అంచనా వేయొద్దు.. ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం!
వెల్లుల్లిని తక్కువ అంచనా వేయొద్దు.. ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం!

Health Benefits of Garlic : వెల్లుల్లిని తక్కువ అంచనా వేయొద్దు.. ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2026
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

వంటింటిలో సర్వసాధారణంగా ఉపయోగించే వెల్లుల్లిను సహజ ఔషధంగా కూడా పరిగణిస్తారు. ప్రతి కూరలో ఏదో ఒక రూపంలో ఉపయోగించే ఈ పదార్థం ఘాటైన వాసనతో పాటు శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు

రోగనిరోధక శక్తి పెంపు

వెల్లుల్లిని నలిపినప్పుడు లేదా కోసినప్పుడు 'అల్లిసిన్' అనే సమ్మేళనం విడుదల అవుతుంది. ఇది శరీరంలోని మాక్రోఫేజెస్, లింఫోసైట్లు వంటి రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకుంటే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వివరాలు

గుండె ఆరోగ్యం

వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, ధమనుల్లో ప్లాక్ పేరుకుపోకుండా నిరోధించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని అల్లిసిన్, అజోయిన్ వంటి పదార్థాలు రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. వాపు, నొప్పి తగ్గింపు కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక వాపు సమస్యలను తగ్గించడంలో వెల్లుల్లి సాయపడుతుంది. రాత్రి భోజనంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల శరీరానికి విశ్రాంతి లభించి, వాపు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు

పేగుల ఆరోగ్యం

వెల్లుల్లి ఒక మంచి 'ప్రీ బయోటిక్'గా పనిచేస్తుంది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడటంతో పాటు హానికరమైన సూక్ష్మజీవులను అడ్డుకుంటుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మెరుగైన నిద్ర రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా మారుతుంది. దీని ప్రభావంతో నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ మెరుగుదల వెల్లుల్లి రక్తం గడ్డకట్టకుండా కాపాడటంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే శస్త్రచికిత్సలకు ముందు వెల్లుల్లి వినియోగంపై వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Advertisement

వివరాలు

బరువు నియంత్రణ

అధిక బరువుతో బాధపడేవారికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ఇందులోని అల్లిసిన్ ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రించడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. మెనోపాజ్ సమస్యలకు ఉపశమనం వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెనోపాజ్ తర్వాత వచ్చే ఈస్ట్రోజన్ లోపం సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్ నియంత్రణలో ఉంటాయి. జలుబు, గొంతు సమస్యలకు రక్షణ వెల్లుల్లిని తరచూ తీసుకునే వారిలో జలుబు, ఊపిరితిత్తుల సమస్యలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గొంతునొప్పి వంటి సమస్యల నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుంది. మొత్తంగా చూస్తే, రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Advertisement