Ragi Omelette Recipe: రుచితో పాటు పోషకాలు డబుల్.. రాగి ఆమ్లెట్ ట్రై చేయండి!
ఈ వార్తాకథనం ఏంటి
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి, అలాగే పోషకాలు సమృద్ధిగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునేవారికి 'రాగి ఆమ్లెట్' (Ragi Omelette) ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ఆరోగ్యకరంగా, ప్రోటీన్ అధికంగా ఉండే ఈ వంటకం తయారు చేయడం చాలా సులభం. రాగులు (Finger Millets) శరీరానికి ఎంతో మేలు చేసే ధాన్యం. సాధారణ ఆమ్లెట్‌లో రాగి పిండి కలిపితే రుచితో పాటు పోషక విలువలు కూడా రెట్టింపు అవుతాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Details
కావలసిన పదార్థాలు
గుడ్లు - 2
రాగి పిండి - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
నల్ల మిరియాల పొడి (Pepper) - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర టీ స్పూన్
మసాలా పొడి - చిటికెడు
కొత్తిమీర - తరిగినది
నూనె - 3 టేబుల్ స్పూన్లు
Details
తయారీ విధానం
మొదట ఒక గిన్నెలో రెండు గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి.
రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి కలపాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పెప్పర్ కలపాలి. అనంతరం రుచికి తగ్గట్టు ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలపాలి.
చివరగా చిటికెడు మసాలా పొడి, తరిగిన కొత్తిమీర వేసి గరిటెతో మిశ్రమం పూర్తిగా కలిసేలా బాగా గిలకొట్టాలి. ఇలా రాగి ఆమ్లెట్ మిశ్రమం సిద్ధమవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలి.
అందులో కొద్దిగా నూనె పోసి వేడెక్కనివ్వాలి.పాన్ వేడైన తర్వాత సిద్ధం చేసిన మిశ్రమాన్ని పోసి ఆమ్లెట్ ఆకారంలో పరచాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి.
అంతే... రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి ఆమ్లెట్ రెడీ.