LOADING...
holi festival: రంగుల హోలీకి ట్రెండీ డ్రెస్సింగ్ ఐడియాస్
రంగుల హోలీకి ట్రెండీ డ్రెస్సింగ్ ఐడియాస్

holi festival: రంగుల హోలీకి ట్రెండీ డ్రెస్సింగ్ ఐడియాస్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ. ఆ రోజున ఇంద్రధనుస్సు రంగులన్నీ మనుషుల ముఖాలపై, దుస్తులపై మెరిసిపోతూ కనిపిస్తాయి. ఎంతో సంబంరంగా... ఉత్సహంతో జరుపుకుంటుంటారు.అయితే ఈ సందర్భంగా ఉపయోగించే రంగుల్లో ఉండే రసాయనాలు చర్మం, జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. వాటి వల్ల చర్మంపై మంట, దద్దుర్లు, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా హోలీ రోజున ఎలాంటి దుస్తులు ధరించాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని హోలీ డ్రెస్సింగ్ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

ఫ్యాబ్రిక్ కుర్తాలు

హోలీ సందర్భంగా మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే తెలుపు రంగు కుర్తా మంచి ఎంపిక. సాదా తెలుపు కుర్తా మాత్రమే కాకుండా పుష్పాల డిజైన్లు ఉన్న వైట్ కుర్తాలను ఎంచుకుంటే ఇంకా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా కాటన్ ఫ్యాబ్రిక్‌ కుర్తాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అలాగే జైపూర్ స్టైల్ కుర్తాలు ధరించడం వల్ల సౌకర్యంతో పాటు ప్రత్యేకమైన లుక్ కూడా పొందవచ్చు. ప్రతి సంవత్సరం వేసుకునే సాదా, పలుచని కుర్తాల బదులుగా ఈసారి మెరుగైన నాణ్యత కలిగిన వైట్ ఫ్యాబ్రిక్ కుర్తాలను ప్రయత్నించండి. వేసవికాలం కావడంతో ఇవి వేడిని తగ్గించి సౌకర్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే పొడవాటి చేతులున్న కుర్తాలు ధరిస్తే రంగుల వల్ల చర్మానికి కలిగే హాని కొంతవరకు తగ్గుతుంది.

వివరాలు 

స్ట్రెయిట్ కాటన్ కుర్తా

ఈ హోలీకి తెలుపు రంగులో స్ట్రెయిట్ కాటన్ కుర్తాను ఎంచుకుని, దానిపై ఆకర్షణీయమైన ప్రింట్లు ఉన్నాయో చూసుకోవాలి. వైట్ కలర్ జైపూర్ కుర్తీస్‌ ధరించడంతో మీరు మరింత అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తారు. వైట్ స్ట్రెయిట్ కాటన్ కుర్తా - పాలోజాతో కలిపి ఎప్పుడూ పూర్తిగా తెలుపు కుర్తాలకే పరిమితం కాకుండా కొంచెం భిన్నంగా ప్రయత్నించవచ్చు. వివరాలు తెల్లటి స్ట్రెయిట్ కాటన్ కుర్తాతో పాటు భిన్న రంగులో ఉండే పాలోజాలను జతచేస్తే లుక్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

Advertisement

వివరాలు 

పాలోజాలు - వైట్ & బ్లూ - ఎత్నిక్ కుర్తాలు

పండుగ రోజున తెలుపు మాత్రమే కాకుండా నీలం, ఎరుపు వంటి రంగులను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా విభిన్న రంగుల సమ్మేళనం మీకు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. హోలీ వేడుకలలో హైహీల్స్ కంటే సాదాసీదా, సౌకర్యవంతమైన చెప్పులు ధరించడం మంచిది. ముఖ్యంగా పూర్తిగా తెల్లటి దుస్తులు కాకుండా ఎక్కువగా వైట్ ఉండే, ప్రింట్లు కలిగిన కుర్తాలను ఎంచుకోవడం ఉత్తమం. ఈసారి ఇలాంటి స్టైలిష్ డ్రెస్సులతో హోలీని ఆనందంగా జరుపుకోండి.

Advertisement