NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ఆహారం: క్యారెట్, తులసి, పుచ్చకాయల జ్యూస్ తో ఆరోగ్యం
    తదుపరి వార్తా కథనం
    ఆహారం: క్యారెట్, తులసి, పుచ్చకాయల జ్యూస్ తో ఆరోగ్యం
    పానీయాల వల్ల కలిగే ప్రయోజనాలు

    ఆహారం: క్యారెట్, తులసి, పుచ్చకాయల జ్యూస్ తో ఆరోగ్యం

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 27, 2022
    04:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శరీరానికి కావాల్సినన్ని పోషకాలు అందాలంటే మన రోజువారి డైట్ లో పండ్లు, కూరగాయలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. వాటిని మీరు తగినంతగా తినలేకపోతే జ్యూస్ చేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి.

    రోజు తప్పించి రోజు ఈ జ్యాస్ లను తీసుకోవడంతో పాటు చిరుతిళ్ళు, చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు, గ్యాస్ నిండి ఉన్న పానీయాలు, ప్రాసెస్డ్ ఆహారాలను దూరం పెట్టాలి.

    జలుబు, దగ్గు, ఆస్తమా, సైనస్ సమస్యలు, ఆస్తమా, అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు తులసి జ్యూస్ చిటికెలో దూరం చేస్తుంది.

    ఇది తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. 25 తులసి ఆకుల్ని తీసుకుని పేస్ట్ తయారు చేసి, నిమ్మరసం, ఉప్పు, నీళ్ళు కలుపుకుని రోజుకు రెండు సార్లు తాగాలి.

    ఆరోగ్యకరమైన ఆహారం

    పుచ్చకాయ, క్యారెట్ జ్యూస్

    పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఉండే పొటాషియం వల్ల రక్తపీడనం(బీపీ) నియంత్రణలో ఉంటుంది. విటమిన్ ఏ, బీ6, బీ1, సి, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉంటాయి.

    ఇవి కాలేయాన్ని, కిడ్నీలను శుభ్రపరుస్తాయి. మూత్రపిండంలో రాళ్ళను బయటకు పంపివేయడంలో పుచ్చకాయ జ్యూస్ సాయం చేస్తుంది. ఈ జ్యూస్ లో చక్కెర, ఉప్పు, మైదా కలపకపోతే బాగుంటుంది.

    క్యారెట్ జ్యూస్ లో అనేక పోషకాలు ఉంటాయి. శరీరంలో ఏర్పడే కణతులను ఇది తొలగిస్తుంది. బలాన్ని అందివ్వడంతో పాటు ఆకలిని పెంచుతుంది.

    రక్తాన్ని శుద్ధి చేసి, చర్మం, గోళ్ళు, వెంట్రుకల సమస్యలు రాకుండా కాపాడుతుంది. కొవ్వును కరిగించి బీపీ పెరగకుండా ఉంచుతుంది. కంటిచూపు సంరక్షణలో దీనిపాత్ర అమోఘం అని అదరికీ తెలుసు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆరోగ్యకరమైన ఆహారం

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    ఆరోగ్యకరమైన ఆహారం

    ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు జబ్బు
    చలికాలంలో చల్లగా హిమక్రిములు లాగించేద్దాం చలికాలం
    నిత్యం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు లైఫ్-స్టైల్
    మీ డైట్ ని మరింత ఆరోగ్యంగా మార్చే ఆయుర్వేద ఆహారాలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025