Cairo: పుట్టిన కొన్ని గంటల్లోనే పసికందు స్టైలిష్ పోజ్.. సోషల్ మీడియాలో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఈజిప్టు రాజధాని కైరోలో పుట్టిన ఓ నవజాత శిశువు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. జన్మించిన కొన్ని గంటల్లోనే ఆ చిన్నారి ఇచ్చిన ప్రత్యేకమైన, ప్రశాంతమైన పోజ్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా ఎంతో రిలాక్స్‌డ్‌గా కనిపిస్తున్న ఆ బిడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కైరోకు చెందిన పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ ఇస్లాం ఎల్దే ఓ శిశువుకు ప్రసవానంతర సంరక్షణ ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత చిన్నారిని గమనించగా,అతడు ఒక కాలిపై మరో కాలు వేసుకుని ప్రశాంతంగా పడుకుని కనిపించాడు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోనట్లుగా ఎంతో హాయిగా ఉన్న ఆ పసికందు భంగిమ డాక్టర్‌ను ఆకట్టుకుంది.
వివరాలు
సరదా వ్యాఖ్యలు చేస్తున్న నెటిజన్లు
దీంతో ఆయన ఆ అరుదైన దృశ్యాన్ని వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.
'అప్పుడే జీవితం అంటే ఏంటో ఈ చిన్నారికి తెలిసిపోయింది','ఫొటో కోసం ప్రత్యేకంగా పోజ్ ఇస్తున్నట్టున్నాడు','పుట్టగానే చిల్ అవుతున్నాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
చిన్నారి ప్రశాంతమైన భంగిమను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే,అతడి క్యూట్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు.
సాధారణంగా నవజాత శిశువులు పుట్టిన వెంటనే ఏడుస్తూ లేదా కదులుతూ కనిపిస్తుంటారు.
అయితే,అందుకు భిన్నంగా ఈ చిన్నారి ఒక కాలిపై మరో కాలు వేసుకుని ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా పడుకుని ఉండటం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈప్రత్యేకమైన పోజే వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణంగా నిలిచింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పుట్టిన గంటల్లోనే కాలు మీద కాలు.. వైరల్ అవుతున్న వీడియో ఇదే..
#VIDEO: Born unbothered! A newborn in Cairo, Egypt, has gone viral for his unusually relaxed pose shortly after birth, lying with his hands behind his head and legs crossed. Egyptian pediatrician Dr. Islam Eldeh dubbed the position the “royal pose,” amusing millions online. pic.twitter.com/Xpgskf8e3J
— Saudi Gazette (@Saudi_Gazette) October 18, 2026