
Motivation: కాలాన్ని కాదు, క్షణాన్ని ఆస్వాదించండి.. ఎందుకంటే జీవితం చిన్నది!
ఈ వార్తాకథనం ఏంటి
మన జీవితంలో అన్నీ అవసరమే, మనకంటూ ఒక కుటుంబం ఉండాలి, వారితో మధురమైన క్షణాలను పంచుకోవాలి, నిజమైన స్నేహితులు ఉండాలి.
అదే సమయంలో, డబ్బు, హోదా, ఇల్లు, కారు వంటి అవసరాల కోసం కూడా కష్టపడాల్సిందే. కొంతమంది భవిష్యత్తు బాగుండాలని కుటుంబాన్ని వదిలేసి దూర దేశాల్లో జీవితం గడుపుతారు.
తమ వాళ్లను సుఖంగా ఉంచాలని నిద్రలేని రాత్రులు గడుపుతారు. కానీ ఈ శ్రమలో జీవితంలోని ఎన్నో విలువైన క్షణాలు చేజారిపోతాయి.
ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తించాలి మనం సంపాదించేది నాకోసం మాత్రమే కాదు, నా కుటుంబం కోసమూ. కానీ అదే సంపాదన ధ్యాసలో పడి వారినే మరిచి పోతాం.
Details
డబ్బు సంపాదనలో పడి కుటుంబాన్ని మరిచిపోతున్నాం
వారితో మాట్లాడటానికి, కలిసి కూర్చోవడానికి కూడా సమయం ఇవ్వలేకపోతాం.
చివరకు మన విలువైన జీవిత కాలాన్ని మర్చిపోతాము. డబ్బు సంపాదన, కష్టపడటం తప్పుకాదు. కానీ దేనికైనా ఒక హద్దు ఉండాలి. మన జీవితంలో మొదటి ప్రాధాన్యత కుటుంబమే కావాలి.
వారి ప్రేమే మన మనశ్శాంతికి మూలం. కానీ వృత్తిపరంగా బిజీగా ఉండిపోయి మన ఒత్తిళ్లు, కోపతాపాలను వారి మీదే తీర్చుకుంటాం.
అప్పుడు మనవాళ్లు దూరమవుతారు. అప్పుడు గుర్తొస్తుంది నేనెందుకోసం జీవిస్తున్నాను?
Details
ఓ ప్రొఫెసర్ చెప్పిన కథను పరిశీలిద్దాం
ఒకసారి ఒక ప్రొఫెసర్ తన విద్యార్థులకు జీవిత విలువను చెప్పేందుకు ఒక ఖాళీ గాజు సీసా తీసుకొచ్చాడు. ముందుగా పెద్ద రాళ్లు వేసి 'ఇప్పుడు సీసా నిండిందా?' అని అడిగాడు.
విద్యార్థులంతా 'అవును' అన్నారు. తర్వాత కొన్ని చిన్నరాళ్లు వేసి మళ్లీ అడిగాడు 'ఇప్పుడు?'. మళ్లీ "అవును" అని సమాధానం.
ఆపై సన్నని ఇసుకను కూడా వేసాడు. ఆ సీసా చివరికి పూర్తిగా నిండిపోయింది. అయన అర్థం చెప్పాడు
ఈ సీసా మీ జీవితం లాంటిది. పెద్ద రాళ్లు- మీ కుటుంబ సభ్యులు, చిన్నరాళ్లు అంటే ఇల్లు, కారు వంటి ఆస్తులు,
ఇసుక - జీవితంలోని సమస్యలు. మీరు మొదట ఇసుకను (సమస్యలను) నింపితే, తర్వాత మిగిలిన వాటికి స్థలం ఉండదు.
Details
కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
అదే మీరు మొదట కుటుంబాన్ని పెట్టితే, మిగిలినవన్నీ దానికింద ఫిట్ అయిపోతాయి.
జీవితం సంతులితంగా ఉంటుంది. కాబట్టి మీ కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.
వారితో ఒక్కరోజైనా ఆనందంగా గడపండి.
వాళ్లు కోరేది డబ్బు కాదు - మీ సమయం, ప్రేమ, సాన్నిహిత్యం. వారితో పిక్నిక్, డిన్నర్ లేదా ఓ చిన్న హాయిగా గడిచే కాఫీ సమయం... ఇవే జీవితాన్ని నిండుగా చేస్తాయి. జీవితం ఒక్కటే..! ఒక్కో క్షణాన్ని ప్రశాంతంగా ఆస్వాదించండి.