మీ పెరట్లో పెరిగే ఇతర దేశాలకు చెందిన మొక్కలు ఏంటో తెలుసుకోండి
మీ పెరట్లో ఇతర దేశాలకు చెందిన మొక్కలను సులభంగా పెంచుకోవచ్చని మీకు తెలుసా? భారతదేశ వాతావరణం విభిన్నంగా ఉంటుంది కాబట్టి వివిధ దేశాలకు చెందిన మొక్కలను కూడా పెంచవచ్చు. ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన ఏయే మొక్కలను పెరట్లో పెంచుకోవచ్చో చూద్దాం. అత్తి మొక్క: మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియా ప్రాంతాలకు చెందిన అత్తి మొక్కలు ఇండియాలో కూడా పెరుగుతాయి. వీటిని నాటిన కొన్నేళ్ల తర్వాత పండ్లు కాస్తాయి. వీటిని మీ పెరట్లో నాటాలనుకుంటే తొందరగా ఎండిపోయే, వేడిగా ఉండే నేలలో నాటాల్సి ఉంటుంది. కివీ: వేడిగా లేదా తేమగా ఉండే ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. తొందరగా ఎండిపోయే నేలలో ఇది త్వరగా పెరుగుతుంది. మొక్క నాటిన తర్వాత పండు కాయడానికి నాలుగేళ్లు పడుతుంది.
పెరట్లో పెంచగలిగే ఇతర దేశాల మొక్కలు
రాంబుటన్ మలేషియా, ఇండోనేషియా ప్రాంతాలకు చెందిన ఈ మొక్కను ఆగ్నేయాసియా ప్రాంతాల్లో పండిస్తారు. దీని పండు ఎర్రగా ఉంటుంది. ఈ మొక్కను పండించడానికి సూర్యరశ్మి బాగా కావాలి. అలాగే త్వరగా ఎండిపోయే నేల అవసరం ఉంటుంది. కాలే: డయాబెటిస్, క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులతో పోరాడే ఔషధ గుణాలున్న కాలే పండు తూర్పు మధ్యధరా ప్రాంతానికి చెందినది. ఈ మొక్కను పండించడానికి సూర్యరశ్మి చాలా అవసరం. అలాగే ఎల్లప్పుడూ నీరు ఉండాలి. బిలింబి: ఇండోనేషియా, మలేషియా ప్రాంతాలకు చెందిన ఈ మొక్కను ఇండియాలో కూడా పండిస్తారు. ఈ మొక్క చలిని తట్టుకోదు కాబట్టి తొందరగా మీరు తొందరగా ఎండిపోయే నేలలో దీన్ని పండించాల్సి ఉంటుంది.