ల్యాప్ టాప్ ముందు కూర్చుంటే కళ్ళు అలసిపోతున్నాయా? ఈ వ్యాయామాలు చేయండి.
ఇప్పుడు జాబ్స్ అన్నీ లాప్టాప్ లకు అతుక్కుపోయి చేయాల్సి వస్తోంది. ఎక్కువ గంటలు లాప్టాప్ తెరను చూడటం వల్ల కళ్ళు అలసిపోతుంటాయి. మరి ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే ఏం చేయాలి? కళ్ళు అలసిపోకుండా ఉండాలంటే కొన్ని ఎక్సర్ సైజెస్ చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. కళ్ళను గుండ్రంగా తిప్పండి లాప్టాప్ మూసేసి సౌకర్యవంతంగా కూర్చుని కనుగుడ్లను గుండ్రంగా తిప్పండి. సవ్యదిశలో పదిసార్లు, అపసవ్య దిశలో పదిసార్లు తిప్పితే సరిపోతుంది. కళ్ళకు వేడిని అద్దండి కళ్ళు బాగా అలసిపోయినప్పుడు రెండు అరచేతులను గట్టిగా రుద్ది, కళ్ళ పైన అరచేతులను ఉంచండి. దీనివల్ల కళ్లకు మంచి ఉపశమనం లభిస్తుంది.
20 నిమిషాలకు ఒకసారి చేసే వ్యాయామం
కళ్ళను ఆర్పడం లాప్టాప్ గానీ, ఫోన్ గానీ వాడుతున్నప్పుడు మనం కళ్ళను ఎక్కువగా ఆర్పకుండా చూస్తూనే ఉంటాము. దీనివల్ల కళ్ళు పొడిబారిపోయి చూపు మసక మసకగా కనిపిస్తుంది. అందుకే కళ్ళు అలసిపోయినట్లు మీకు అనిపించినప్పుడు లాప్టాప్ మూసేసి 20సెకండ్ల పాటు 20సార్లు కళ్ళను ఆర్పండి. ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నప్పుడు ప్రతీ 20నిమిషాలకు ఒకసారి ఈ వ్యాయామం చేస్తే కళ్ళు అలసిపోకుండా ఉంటాయి. జూమింగ్ ఎక్సర్సైజ్ సౌకర్యవంతంగా కూర్చుని చేతిలో పెన్ పట్టుకుని ముందు వైపునకు చేతిని చాపండి. ఇప్పుడు పెన్ను మీకు కొంచెం దూరంలో ఉంది. మీరు ఆ పెన్ను ని చూస్తూ చేతిని మీ ముఖం దగ్గరకి పెన్నును తీసుకురండి. ఆ తర్వాత అదే పద్ధతిలో వెనక్కి తీసుకెళ్లండి.