
Father's Day 2025: ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకి 'హీరో'లా ఇలా స్పేషల్ గిఫ్ట్ ఇవ్వండి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో తండ్రి ఇచ్చే భరోసా, రక్షణ మరెవ్వరి నుంచీ రావు. తల్లి తొమ్మిది నెలలు మోసి, పుట్టించి పెంచినా... జీవితం లో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని తట్టుకోకుండా ఉండేలా చూసేది మాత్రం తండ్రే.
చాలా సందర్భాల్లో తండ్రి కఠినంగా ఉన్నట్లు కనిపించవచ్చు. కానీ ఆ కఠినత వెనుక దాగి ఉన్న ప్రేమ మాత్రం అంతులేని సముద్రం లాంటిది.
మీ అడుగులో తప్పులొస్తే చాలు.. ఏ మేరకు స్వేచ్ఛ ఇవ్వాలో, ఎక్కడ అడ్డుకట్ట వేయాలో తల్లి కంటే ముందు తెలుసుకునే వ్యక్తి నాన్నే.
అమ్మ ప్రేమను తక్కువ చేయలేం కానీ నాన్న ప్రేమ కొంచెం దూరంగా కనిపించవచ్చు.
Details
నాన్నే ధైర్యం
కానీ ఆయన చూపే ప్రేమ, పట్టుదల మరెవ్వరూ చూపలేరు. మీ కలలన్నీ నెరవేర్చేందుకు కాస్త ఆలస్యంగా అయినా శ్రమించే వ్యక్తి నాన్నే. ఏదైనా మీకు కావాలంటే నేరుగా అడగలేరు.
కానీ అమ్మ ద్వారా పంపిస్తారు. ప్రేమను కఠినత ముసుగులో దాచే వ్యక్తి నాన్న. అలాంటి తండ్రికి అంకితం చేసిన ప్రత్యేక రోజు 'ఫాదర్స్ డే'.
ఈ సందర్భంగా మీ నాన్నను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఐడియాస్ తప్పక ప్రయత్నించండి:
Details
1. పర్స్ - ప్రతి నాన్నకు ప్రత్యేకం
నాన్నలకి పర్సులు అంటే ఎంతో ఇష్టం. కొన్ని పర్సులు పదేళ్లుగా వాడుతుంటారు కూడా. పర్సు కొత్తదిగా ఇవ్వడం ఓ సెంటిమెంట్‌లా ఉంటుంది.
అందుకే మీ నాన్నకు స్టైలిష్, క్వాలిటీ పర్స్ బహుమతిగా ఇవ్వండి. ఇది చూసే ప్రతిసారీ ఆయన ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది.
2. స్మార్ట్ వాచ్ - ఆరోగ్యానికి గుర్తింపు
చాలామంది తండ్రులకు వాచ్‌లంటే ఆసక్తి ఉంటుంది.
ప్రత్యేకించి ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే స్మార్ట్‌వాచ్ ఇవ్వడం వల్ల... హార్ట్‌రేట్, స్టెప్స్, నిద్ర లాంటి వివరాలు ట్రాక్ చేయొచ్చు. ఇది మీ నాన్న ఆరోగ్యంపై కేర్ తీసుకుంటున్నట్టూ ఆయనకు ఫీల్ అవుతుంది.
Details
3. బహిరంగంగా వెకేషన్ గిఫ్ట్!
తిరిగే మనసు నాన్నలకూ ఉంటుంది. కానీ పిల్లల కోసం వాళ్ల కోరికల్ని అణిచేస్తుంటారు. ఈసారి ఫాదర్స్ డే రోజున మీ నాన్నను బయటకు తీసుకెళ్లండి.
రెస్టారెంట్‌కి తీసుకెళ్లండి, లేక ఫేవరైట్ ప్లేస్‌కి వెళితే చాలు - ఆ అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది.
4. ఫోటో బుక్ - జ్ఞాపకాలను జీవించండి
మీ తండ్రితో ఉన్న పాత ఫోటోల్ని ఒక ప్రత్యేకమైన ఫోటో బుక్ రూపంలో తయారుచేసి గిఫ్ట్ చేయండి.
చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఆయనతో గడిపిన మంచి క్షణాల్ని సెలెక్ట్ చేసి, ఓ అల్బమ్ క్రియేట్ చేయండి. చూసిన వెంటనే ఆయన మొహంలో వెలుగు ఉరకలేస్తుంది.
Details
5. నాన్నకు ఇష్టమైనవి చేయండి - ప్రేమను తిరిగి చెలిమిదిద్దాం
పిల్లల కోసం తల్లిదండ్రులు తమ ఇష్టాలను త్యాగం చేస్తారు. కానీ ఫాదర్స్ డే రోజున మీ నాన్నకు ఇష్టమైన పనులు చేయండి.
ఆయనకు ఇష్టమైన వంటకం, మ్యూజిక్, సినిమాలు.. ఏదైనా కావొచ్చు. ఆయనతో కలిసి గడిపే కొన్ని గంటలు ఆయనకు బహుమతిగా మించినవి.