
ప్రపంచంలో చెప్పుకోదగిన పండగలు, తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
మనదేశంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు ఎలా జరుపుతామో అలాగే కొన్ని దేశాల్లో వారి సంస్కృతులకు సంబంధించిన పండగలను కూడా అదే విధంగా కొన్ని రోజులపాటు జరుపుకుంటారు.
ఈ పండగలను ఎక్కువ రోజులు జరుపుకోవడం వల్ల ఆ ప్రాంతమంతా కోలాహాలంగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అనేక గొడవలు అల్లర్లతో ఇబ్బందికరంగాను ఉండే అవకాశం ఉంది.
అలాంటి సంఘటనల గురించి పక్కన పెడితే, ప్రస్తుతం ప్రపంచంలో చెప్పుకోదగిన కొన్ని పండగలు, వాటి విశేషాల గురించి మాట్లాడుకుందాం.
జాజ్ ఇన్ మార్షియాక్:
ఫ్రాన్స్ నైరుతి రాజ్యమైన గ్యాస్కోనీ ప్రాంతంలో జాజ్ కచేరీలు, జాజ్ సంబంధిత ప్రదర్శనలు జరుగుతాయి.
మొట్టమొదటిసారిగా 1978లో జాజ్ కచేరీల పండగ మొదలైంది. ఈ పండగ రెండు వారాలపాటు కొనసాగుతుంది.
Details
హాంకాంగ్ లో చైనీస్ కొత్త సంవత్సరం
ఈ పండుగను హాంకాంగ్ లో జరుపుకుంటారు. చైనీస్ నూతన సంవత్సర వేడుకలుగా పిల్చుకోబడే ఈ పండగ, దాదాపు 15రోజులపాటు జరుగుతుంది.
ఈ పండగ ప్రారంభం నుండి ప్రతిరోజూ బాణసంచా కాల్చడం, వింత వింత వేషాలతో డ్యాన్సులు చేయడం వంటివి హాంకాంగ్ ప్రజలకు అలవాటుగా ఉంటుంది.
రియో కార్నివాల్:
రియో కార్నివాల్ దాదాపు నాలుగు రోజులపాటు కొనసాగుతుంది. ఈ పండగలో సాంబార్ పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
వీధుల్లోకి వచ్చి మరీ డ్యాన్సులు చేస్తూ ఎంతోమంది కనిపిస్తారు. ఈ పండగలో ఎక్కువగా ఆఫ్రికన్ సంస్కృతుల ప్రభావం ఉంటుంది.
Details
మర్ది గ్రాస్
ఈ పండగను చాలా దేశాల్లో జరుపుకుంటారు. ఫ్రాన్స్, బెల్జియం, స్వీడన్, ఇటలీ, జర్మనీ, చెక్ రిపబ్లిక్ మొదలగు దేశాల్లో ఈ పండగను జరుపుకుంటారు.
పండగ సమయంలో కూడా జనాలందరూ వివిధ రకాల కాస్ట్యూమ్స్ ధరించి వీధుల్లోకి వచ్చి మ్యూజిక్ ని ఆనందిస్తుంటారు.
ట్రంపెట్ ఫెస్టివల్:
ఇలాంటి ఫెస్టివల్ కూడా ఉంటుందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ఉంటుంది. గుంపులు గుంపులుగా ట్రంపెట్లు ఊదుతూ రోడ్లమీదకు రావడమే ఈ పండగ స్పెషల్.
ట్రంపెట్ ని ఊదుతుంటే దానికి తగినట్టుగా ఇతరులు డాన్స్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ పండగ ఆగస్టులో జరుగుతుంది.