Page Loader
Motivational: అసంతృప్తి,అసూయ,ద్వేషం.. ఇవి శాశ్వత దుఃఖానికి దారితీసే మనోభావాలు
అసంతృప్తి,అసూయ,ద్వేషం.. ఇవి శాశ్వత దుఃఖానికి దారితీసే మనోభావాలు

Motivational: అసంతృప్తి,అసూయ,ద్వేషం.. ఇవి శాశ్వత దుఃఖానికి దారితీసే మనోభావాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొంతమంది వ్యక్తుల మనసు ఎప్పుడూ అసంతృప్తితో నిండిఉంటుంది. వారు ఎన్నిసార్లు ఏం పొందినా, ఎంత సుఖంగా ఉన్నా తృప్తి చెందరు. వారి చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉంటే అసహనం వ్యక్తపరుస్తారు. ఇలాంటి స్వభావాలు వ్యక్తి జీవితంలో అభివృద్ధిని అడ్డుకుంటాయి. మన జీవితం సాఫీగా సాగాలంటే ప్రతికూల ఆలోచనల్ని పక్కన పెట్టి, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అనేకమంది మహనీయుల జీవితం, వారి ఆలోచనలు మనకు ప్రేరణగా నిలుస్తాయి. ఆ ధృక్పథం వల్ల మనం ముందుకు సాగే బలాన్ని పొందగలం. మహాభారతంలో ప్రముఖమైన పాత్రలలో విదురుడు ఒకరు. ఆయన తత్వచింతన, విజ్ఞానం, భక్తి మార్గం - ఇవన్నీ ఆయన్ని ఎంతో గొప్పవాడిగా నిలిపాయి. ఆయన చెప్పిన మానవధర్మ సూత్రాలను 'విదుర నీతి'గా పిలుస్తారు.

వివరాలు 

అసూయ 

విదురుని ప్రకారం, ఇతరుల విజయాలను చూసి అసూయపడే వ్యక్తి మనసు ఎప్పుడూ కలతతో ఉంటుంది. అలాంటి మనస్తత్వం ఉన్నవాడు తనలోని ధైర్యాన్ని కోల్పోతాడు. అంతేకాదు, తనతోపాటు ఇతరుల్లోనూ ప్రతికూల భావాలను కలిగిస్తాడు. అసూయ ఒక విధంగా ఆత్మవిశ్వాసాన్ని విచ్చిన్నం చేస్తుంది.

వివరాలు 

ద్వేషం 

ద్వేషభావన వ్యక్తి లోపలుండే శాంతిని పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ భావన వల్ల మనసు ఎప్పుడూ మండిపోతుంటుంది. ఇతరుల పట్ల అప్రయోజక ద్వేషం పెరిగితే, ఆ వ్యక్తి చివరకు ఒంటరితనాన్నినే ఎంచుకోవల్సి వస్తుంది. అతడు తన మిత్రులను, బంధువులను కోల్పోతాడు. ద్వేషాన్ని పోగొట్టకపోతే జీవితంలో శాంతి దొరకదు. అసంతృప్తి విదురుని దృష్టిలో ఉన్నదానిపై సంతృప్తిగా ఉండడం జీవితంలో ఆనందానికి ఆధారం. తనకు ఏమి ఉన్నా సరిపోదని భావించే వ్యక్తి ఎప్పుడూ అసంతృప్తితో జీవిస్తాడు. సుఖాలు ఎదురైనా, వారికి అవి అసంతృప్తినే కలిగిస్తాయి. సంతోషానికి మార్గం అసంతృప్తితో కలిసి ఉండదు.

వివరాలు 

కోపం, అనుమానం

విదురుడు కోపాన్ని ఒక తీవ్ర ప్రమాదకర లక్షణంగా పేర్కొంటాడు. కోపం వల్ల వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, సంబంధాల పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. కోపంతో కాపాడుకున్న సంబంధాలు కూడా తుడిచిపెట్టబడతాయి. అంతేగాక, ఎప్పుడూ అనుమానించే అలవాటు ఉన్నవారు జీవితం మొత్తం అపస్వరంలో గడుపుతారు. విశ్వాసం లేని జీవితం ఎప్పుడూ శోకమే తెస్తుంది.

వివరాలు 

ఆత్మనిర్భరత అవసరం 

మంచి జీవితం కోసం శ్రమించాల్సిన అవసరం ఉంది. ఇతరులపై ఆధారపడటం వలన గౌరవం పోతుంది. శ్రమకే విలువ ఉంటుందని విదురుడు చెప్పారు. ఎవరు స్వయంగా కష్టపడి పని చేయకుండా, దానికంటే ఇతరుల మీద ఆధారపడతారో వారు సామాజికంగా గౌరవం పొందరు. వారి జీవితం అంతా అసంతృప్తితో నిండి ఉంటుంది.