మానసిక ఆరోగ్యం: మీ చుట్టూ పాజిటివ్ పర్సన్స్ ఉండాలంటే ఇలా చేయండి
మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో మీరు కూడా అలాగే ఉంటారు. ఇది పాత సామెత కావచ్చు గానీ పచ్చినిజం. అందుకే మీ చుట్టూ ఎల్లప్పుడూ పాజిటివ్ పర్సన్స్ ఉండేలా చూసుకోవాలి. ఏ రంగంలోనైనా విజయం పొందాలంటే మీ చుట్టూ విజయాన్ని ప్రొత్సహించే వాళ్ళు ఉండాలి. లేదంటే మీలో నిరాశ ఏర్పడచ్చు. మరి మీ చుట్టూ పాజిటివిటీని నింపే పర్సన్స్ ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఎదగాలనుకునే వారిని పసిగట్టండి: అలవాట్లు అనేవి అంటు వ్యాధుల్లాంటివి. మీరు గొప్పగా ఎదగాలంటే మీ పక్కన గొప్ప అలవాట్లున్న పర్సన్స్ అయినా ఉండాలి. గొప్ప అలవాట్లున్న వాళ్ళను వెతికి పట్టుకోండి. వాళ్ళతో సమయం గడపండి. దానివల్ల మీలోనూ ఎదుగుదలకు సరిపడే లక్షణాలు వస్తాయి.
నెగెటివ్ ఆలోచనలను, నెగెటివ్ పర్సన్స్ ని దూరం పెట్టాలి
మీ రోజు వారి పనుల్లో మీకు నెగెటివ్ పర్సన్స్ ఎదురవుతారు. ఏ పని కూడా తమ వల్ల కాదని, అలా కాకపోవడానికి కారణం డబ్బులేకపోవడం అనో, లేక మరేదో కారణం చెప్తారు. వారి నుండి వెంటనే పక్కకు వచ్చేయండి. లేదంటే ఆ నిరాశ మీకు కూడా అంటుకుని మిమ్మల్ని నిరాశవాదంలోకి తీసుకెళ్తుంది. అప్పుడు మీరు కూడా వాళ్ళలానే మారిపోతారు. మీతో మీరు పాజిటివ్ గా ఉండడం అలవాటు చేసుకోండి. అలాంటప్పుడే అవతలి వారు మీకు అట్రాక్ట్ అవుతారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళతో జోక్స్ వేయండి. అది సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పాజిటివ్ పర్సన్స్ తో సంభాషణ మీరే ప్రారంభించండి. అవతలి వాళ్ళు మిమ్మల్ని పలకరించేదాకా వేచి చూడొద్దు.