మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? మెదడులో సెరెటోనిన్ స్థాయిలను పెంచుకోండిలా
మీ మెదడులో సెరెటోనిన్ అనే రసాయనం కావాల్సినంత మోతాదులో విడుదల కాకపోతే మీకు నిద్ర సరిగ్గా పట్టదు, ఊరికే అలసిపోతారు. కోపం పెరుగుతుంది. జీర్ణసమస్యలు తలెత్తుతాయి. ఆకలి తగ్గిపోతుంది. అందుకే సెరెటోనిన్ స్థాయిలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా ఎక్సర్ సైజ్ ఖచ్చితంగా చేయాలి. వ్యాయామం వల్ల ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఆ అమైనో ఆమ్లమే మెదడులో సెరెటోనిన్ గా మారుతుంది. సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్స్ చేయడం వల్ల సెరెటోనిన్ స్థాయి పెరుగుతుంది. ఎండలో కాసేపు: ఒకరోజులో కనీసం 10 నుండి 15 నిమిషాలు ఎండలో నిల్చోవాలి. సూర్యరశ్మి వల్ల సెరెటోనిన్ పెరుగుతుంది.
సెరెటోనిన్ స్థాయిలను పెంచే మరిన్ని మార్గాలు
ఒత్తిడి దూరం చేసుకోవాలి: ఎమోషన్స్ కు లోనై ఒత్తిడికి గురి కావద్దు. ఏ విషయాన్నైనా చాలా తేలికగా తీసుకుంటే అది మనమీద ఒత్తిడి చేయదు. ఒత్తిడి లేకపోతే సెరెటోనిన్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. యోగా, ధ్యానం సంగీతం వినడం, అవతలి వారి పట్ల విశ్వాసంగా ఉండడం, పాజిటివ్ విషయాలు మాత్రమే డిస్కస్ చేయడం, వేడి నీటితో స్నానం, మసాజ్ మొదలగునవి ఒత్తిడి దూరం చేస్తాయి. ఆహారంలో మార్పులు: సెరెటోనిన్ ని పెంచే ట్రిఫ్టోఫాన్ అందించే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. గుడ్లు, సోయాసాస్, చికెన్, గుమ్మడికాయ విత్తనాలు, సూర్యపువ్వు విత్తనాలు మంచిమేలు చేస్తాయి. వీటన్నింటితో పాటు మీ ఫ్యామిలీతో సాయంత్రాలను సరదాగా గడపండి. దీనివల్ల పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడి సెరెటోనిన్ వృద్ధిని ప్రోత్సహిస్తుంది.