
Healthy Liver Tips: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. గ్యాస్ట్రో నిపుణుల సలహా ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ నిపుణుడు జీర్ణవ్యవస్థ, కాలేయ ఆరోగ్యంపై తరచూ విలువైన సూచనలు అందిస్తుంటారు.
జూన్ 10న ఆయన తన నంబర్ 1 లివర్ హెల్త్ టిప్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిన్నచిన్న మార్పులతో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని తెలిపారు.
డాక్టర్ సేథీ వివరించిన నాలుగు ముఖ్య చిట్కాలు ఇవే:
1.మద్యపానం, ప్రాసెస్డ్ ఫుడ్‌కు గుడ్‌బై చెప్పండి
నిపుణుల సూచనల ప్రకారం, మద్యం సేవించడాన్ని పూర్తిగా తగ్గించాలి.
ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలను దూరంగా పెట్టాలి.
ఓ అధ్యయనం ప్రకారం అలాంటి ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD), లివర్ ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం పెరుగుతుంది.
Details
2. '3 బి' లను ఆహారంలో చేర్చండి.. బీట్రూట్, బ్రోకలీ, బెర్రీలు
లివర్ పనితీరు మెరుగుపరచడంలో సహాయపడే మూడు ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి నిపుణులు ప్రత్యేకంగా చెప్పారు. అవి బీట్రూట్, బ్రోకలీ, బెర్రీలు.
ఇందులో బ్లూబెర్రీలకి ప్రాధాన్యత ఉంది. మరో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ సల్హాబ్ ప్రకారం, బ్లూబెర్రీలలో ఉన్న పీటెరోస్టిల్బెన్ అనే యాంటీఆక్సిడెంట్ కాలేయానికి చాలా ప్రయోజనం చేకూర్చుతుంది.
ఇది క్యాన్సర్ నిరోధక గుణాలు కలిగి ఉండటం విశేషం.
3. బ్లాక్ కాఫీని అలవాటు చేసుకోండి
బ్లాక్ కాఫీ తరచుగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గించేందుకు, కాలేయ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించేందుకు సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
"మీ శరీరం తట్టుకోగలిగితే బ్లాక్ కాఫీ తాగడం మంచిదే అని ఆయన పేర్కొన్నారు. ఇది మెదడు, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందన్నారు..
Details
4. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రతి రాత్రి 7-9 గంటల నాణ్యమైన నిద్ర తీసుకోవడం వల్ల కాలేయానికి విశ్రాంతి లభించి, అది పునరుద్ధరించుకునే అవకాశాన్ని పొందుతుంది.
మాక్స్ హెల్త్‌కేర్ నివేదిక ప్రకారం, మంచి నిద్ర లివర్ పనితీరును గణనీయంగా మెరుగుపరచగలదని వెల్లడించింది.