Food: ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని మీకు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
చిన్నప్పటి నుండి ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మనకు అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటు ప్రకారంగానే పండ్లు తిన్న వెంటనే కూడా నీళ్లు తాగుతారు.
అయితే కొన్ని పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. అలా తాగడం వల్ల శరీరంలోని పీహెచ్ స్థాయిల్లో మార్పు కలుగుతుంది. అలాగే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.
ప్రస్తుతం ఏ పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
వాటర్ మిలన్:
వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇలా ఏదైనా కానీ నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
Details
అరటి పండు తిన్నాక 15నిమిషాలు వెయిట్ చెయాల్సిందే
జామ పండ్లు:
జామ పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగితే ఎసిడిటీ సమస్య వస్తుంది. అలాగే జీర్ణసంబంధ సమస్యలు కలుగుతాయి. అందుకే జామ పండ్లను తిన్న తర్వాత 30 లేదా 45 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి.
అరటి పండ్లు:
చాలామంది నిపుణులు అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని చెబుతారు. ముఖ్యంగా చల్లని నీళ్లు అస్సలు తాగకూడదు. ఇలా తాగడం వల్ల అరటిపండు సరిగ్గా జీర్ణమవ్వక గ్యాస్ వంటి సమస్యలను తీసుకొస్తుంది. అందుకే కనీసం 15 నిమిషాలు వెయిట్ చేయాలి.
బొప్పాయి:
ఈ పండు తిన్న వెంటనే నీళ్లు తాగితే నీళ్లు విరేచనాల సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు కలుగుతాయి.