LOADING...
Beauty Tips: చర్మం నల్లగా మారిపోయే వారికి అలర్ట్.. ఇలా చేస్తే మెరిసే స్కిన్ మీ సొంతం!
చర్మం నల్లగా మారిపోయే వారికి అలర్ట్.. ఇలా చేస్తే మెరిసే స్కిన్ మీ సొంతం!

Beauty Tips: చర్మం నల్లగా మారిపోయే వారికి అలర్ట్.. ఇలా చేస్తే మెరిసే స్కిన్ మీ సొంతం!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 08, 2026
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎండాకాలంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో చర్మం ముదురు రంగుకు మారడం ఒకటి. దీనిని నివారించేందుకు చాలా మంది బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ వాడుతుంటారు. అయితే నిపుణుల ప్రకారం సూర్యకిరణాల్లోని అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తగ్గించగల శక్తి మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల్లో కూడా ఉంటుంది. వీటిలో ఉన్న ప్రత్యేక పోషకాలు, రసాయన సమ్మేళనాలు చర్మాన్ని ఎండ వల్ల కలిగే నష్టాల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇప్పుడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

వివరాలు

ఈ పండ్లతో లాభాలు..

ఎండ ప్రభావం వల్ల చర్మం ముదురు కాకుండా ఉండటానికి పండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా దానిమ్మ, స్ట్రాబెర్రీ, జామ వంటి పండ్లు ఇందులో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మలో సమృద్ధిగా లభించే ఎల్లాజిక్ ఆమ్లం సూర్యకిరణాల నుంచి వచ్చే యూవీ కిరణాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది చర్మంలో కొత్త కణాల నిర్మాణాన్ని ప్రోత్సహించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది.

వివరాలు

ఆరోగ్యాన్ని కాపాడేవి ఇవే..

స్ట్రాబెర్రీ: ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యూవీ కిరణాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి పండ్లు కూడా చర్మాన్ని ఎండ ప్రభావం నుంచి కాపాడడంలో ఉపయోగపడతాయి. జామపండు: అన్ని కాలాల్లో దొరికే జామపండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఎండ నుంచి రక్షించడమే కాకుండా చర్మ క్యాన్సర్ వంటి సమస్యల నుంచి కూడా కాపాడగలవని నిపుణులు సూచిస్తున్నారు. అదనంగా యాపిల్, కివీ, పుచ్చకాయ వంటి పండ్లు కూడా చర్మానికి రక్షణనిస్తాయి.

Advertisement

వివరాలు

సహజ కాంతిని పొందండిలా..

ఆలూ (బంగాళాదుంప): దీనితో చేసిన వంటకాలు చాలా మందికి ఇష్టమే. కానీ ఇది చర్మానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి సహజ కాంతిని అందించడంలో సహాయపడుతుంది. ఇందులోని పిండి పదార్థాలు చర్మం ఎండ వల్ల ముదురు కాకుండా రక్షిస్తాయి. ఆలూను మెత్తగా చేసి ఎండ తగిలే ప్రదేశాల్లో రాస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని సూచిస్తున్నారు. బంగాళాదుంపల్లో ఉండే పాలీఫెనాల్స్ సూర్యకిరణాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి చర్మాన్ని సమాన రంగులో ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో ఉన్న జింక్ చర్మం త్వరగా కోలుకోవడంలో, వాపు తగ్గించడంలో దోహదం చేస్తుంది అని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ వెల్లడించింది.

Advertisement