Page Loader
దవడ నుండి చెవి వరకు నొప్పిగా ఉంటుందా? టీ ఎమ్ జే డిజార్డర్ కావచ్చు
టీ ఎమ్ జే డిజార్డర్ రావడానికి కారణాలు

దవడ నుండి చెవి వరకు నొప్పిగా ఉంటుందా? టీ ఎమ్ జే డిజార్డర్ కావచ్చు

వ్రాసిన వారు Sriram Pranateja
Jan 06, 2023
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ ఎమ్ జే డిజార్డర్ అనేది దవడ జాయింట్ల వద్ద నొప్పిని కలిగిస్తుంది. దీనివల్ల దవడ చుట్టూ ఉన్న కండరాల్లో నొప్పి కలుగుతుంది. కొన్నిసార్లు ఈ నొప్పి చెవి వరకూ ఉంటుంది. ఇది చాలా సాధారమైన సమస్య. భారతదేశంలో ప్రతీ ఏటా దాదాపు 10మిలియన్ల మంది ఈ డిజార్డర్ కి గురవుతున్నారు. ఈ డిజార్డర్ కి నిజమైన కారణం ఏంటనేది ఈజీగా తెలుసుకోలేరు. ప్రస్తుతం ఈ డిజార్డర్ గురించి తెలుసుకుని, దానివల్ల కలిగే నష్టాల నుండి ఎలా బయటపడాలో చూద్దాం. ఈ నొప్పి శాశ్వతం కాదు: మన పుర్రను దవడను కలిపే అతుకు టెంపోరోమాండిబ్యులార్. ఈ అతుకులో ఏదైనా సమస్య వచ్చినపుడు దవడ భాగం మొత్తం నొప్పికి గురవుతుంటుంది.

ఆరోగ్యం

దానంతట అదే తగ్గిపోతుంది

ఒక్కోసారి ఈ నొప్పి ఒక దవడకే ఉంటే చాలా కొంతమందిలో మాత్రమే రెండు దవడల జాయింట్లలో కనిపిస్తుంది. సాధారణంగా ఈ నొప్పి కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత అదే దానంతట అదే తగ్గిపోతుంది. ఆర్థరైటిస్, దవడకు దెబ్బ తగలడం, పంటి సంబంధించిన ఇబ్బందులు ఎదురైనపుడు ఈ డిజార్డర్ బయటకు వస్తుంది. ఈ డిజార్డర్ కారణంగా నోరు తెరవాలన్నా మూయాలన్నా నొప్పి కలుగుతూ ఉంటుంది. ముఖ కండరాలు లాగినట్టుగా అనిపిస్తాయి. ఆహారం నమలాలన్నా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటే నొపి నుండి ఉపశమనం కలిగించే మందులను వాడవచ్చు. అలాగే ఈ డిజార్డర్ వల్ల నిద్ర దూరమైతే దానికి కూడా మందులు వాడవచ్చు.