
రాశిని బట్టి రాఖీ పండగ రోజు ఇవ్వాల్సిన బహుమతులు
ఈ వార్తాకథనం ఏంటి
రాఖీ పండగ మరెంతో దూరంలో లేదు, అన్న తమ్ముళ్లకు, అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టి మాకు రక్షణగా ఉండాలని కోరుకుంటారు.
రాఖీ కట్టుకున్న అన్నా తమ్ముళ్లు తమ అక్కాచెల్లెళ్ల కోసం ఏదైనా బహుమతిని ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ బహుమతుల విషయంలో చాలామందికి ఒక రకమైన కన్ఫ్యూషన్ ఉంటుంది. ఎలాంటి బహుమతిస్తే బాగుంటుంది? ఏదైనా కొత్తగా ఇస్తే బాగుంటుందా అన్న సందేహాలు కలుగుతుంటాయి.
ప్రస్తుతం రాశి ఆధారంగా ఎలాంటి బహుమతులు మీ అక్కాచెల్లెళ్లకు అందిస్తే బాగుంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
Details
బ్రాండెడ్ వస్తువులను ఇష్టపడే రాశివారు
మేష రాశి
సాధారణంగా ఈ రాశి వారు సాహసాలను ఇష్టపడుతుంటారు. కాబట్టి వీరికి ఏదైనా సాహసానికి సంబంధించిన బహుమతులు ఇస్తే బాగుంటుంది.
వృషభం
సాధారణంగా వీళ్ళు ఖరీదైన బహుమతులను ఇష్టపడతారు, బ్రాండెడ్ వస్తువులు బహుమతిగా అందుకోవాలని అనుకుంటారు.
మిధునం
వీళ్ళు సాధారణంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి వీరికి ప్రత్యేకమైన బహుమతి ఇస్తే బాగుంటుంది.
కర్కాటకం
వీళ్లు కొంచెం ఎమోషనల్ గా ఉంటారు. సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరికి చేతితో తయారు చేసిన వస్తువులు, పెయింటింగ్స్ వంటివి ఇస్తే బాగుంటుంది.
Details
ప్రత్యేకమైన బహుమతి కావాలనుకునే రాశివారు
సింహం
వీరికి సంగీతం అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏదైనా సంగీతానికి సంబంధించిన సాధనాన్ని బహుమతిగా ఇస్తే బాగుంటుంది.
కన్య
వీరు తమ శరీరం పట్ల ఎక్కువ జాగ్రత్తతో ఉంటారు. కాబట్టి వీరికి సెల్ఫ్ కేర్ సాధనాలను బహుమతిగా అందించవచ్చు.
తుల
వీళ్లు చాలా సున్నిత మనస్కులు, ఎదుటివారిని నొప్పించకుండా బ్రతకాలనేది వీరి ఆలోచనగా ఉంటుంది. వీరికి ప్రత్యేకమైన బహుమతి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు.
వృశ్చికం
వీరు చాలా ఖరీదైన వస్తువులను బహుమతులుగా కోరుకుంటారు. ఖరీదైన బట్టలు, ఖరీదైన షూస్ ఇలా బ్రాండెడ్ వస్తువులను బహుమతులుగా కావాలని కోరుకుంటారు.
Details
కళలకు సంబంధించిన వస్తువులను ఇష్టపడే రాశివారు
ధనుస్సు
వీరికి పర్యాటకం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి సందర్శన ప్రదేశాలకు వీరిని తీసుకెళ్లడం అన్నిటికంటే మంచి బహుమతి అవుతుంది.
మకరం వీరు కూడా సంగీతం అంటే చెవి కోసుకుంటారు. వీరు ముఖ్యంగా హెడ్ ఫోన్స్ ఎక్కువగా ఇష్టపడతారు.
కుంభం
వీరు టెక్నాలజీ గ్యాడ్జెట్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఛారిటీ చేయడానికి ముందుంటారు కాబట్టి వీరి పేరు మీద ఏదైనా ఛారిటీకి డబ్బులు అందిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు.
మీన రాశి
వీరు కళా హృదయులు అని చెప్పవచ్చు. కాబట్టి వీరికి కళలకు సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇస్తే బాగుంటుంది. కవితల కలెక్షన్ గానీ, ఏదైనా మంది పుస్తకం గానీ బహుమతిగా ఇవ్వండి.