అందం: 2023లో ఈ హెయిర్ స్టైల్స్ తో మీ జుట్టుకు కొత్త అందం తీసుకురండి
జుట్టును ఎన్ని స్టైల్స్ లో అయినా దాన్ని సెట్ చేసుకోవచ్చు. నిజమే.. హెయిర్ స్టైల్స్ వల్ల పూర్తి లుక్ మారిపోతుంది. ఒక్కో స్టైల్ లో ఒక్కో విధంగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం మనమందరం కొత్త సంవత్సరంలో ఉన్నాం. ఈ కొత్త సంవత్సరంలో కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి. మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకున్నట్టుగా ఉంటుంది, అవతలి వాళ్ళకు కొత్తగా చూపించినట్టూ ఉంటుంది. బాక్స్ బాబ్స్: బాబ్ హెయిర్ కట్ అనేది ఎప్పటి నుండో ఉన్న స్టైల్. ఈ స్టైల్ ని ఫాలో అయ్యేవారు 2023లో ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య జరిగిన ఫంక్షన్ లలో రెడ్ కార్పెట్ మీద ఈ హెయిర్ స్టైల్ తో చాలామంది తారలు మెరిసారు.
మరిన్ని హెయిర్ స్టైల్స్
జిగ్ జాగ్ పార్టింగ్: హెయిర్ ని ఇష్టం వచ్చినట్టుగా మార్చేసి ఒకరకమైన స్టైల్ కి తీసుకురావడమే జిగ్ జాగ్ స్టైల్. తలపై భాగంలోని జుట్టును వదిలేసి, పక్కన భాగంలోని వాటిని కత్తిరించేసి కూడా కట్స్ డిజైన్ చేస్తారు. బటర్ ఫ్లై కట్: జుట్టు చిన్నదైనా, పెద్దదైనా.. పెద్ద వయసు గలవారికైనా, చిన్న వయసు గల వారికైనా ఈ హెయిర్ కట్ సూట్ అవుతుంది. ఈ స్టైల్ లో చాలా అందంగా కనిపిస్తారు. ఫిక్సీ: హెయిర్ ని పూర్తిగా చిన్నగా కత్తిరించేసి, కలర్ వేసి ఒకవిధమైన స్టైల్ కి తీసుకువస్తారు. ఇది కొన్ని సార్లు బాబ్ హెయిర్ కట్ తో కలిపి ఉంటుంది. రంగు వేయడం వల్ల ఫిక్సీలోకి మారిపోతుంది.