మీ ప్రియమైన వారికి గిఫ్ట్ అందించడంలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర
ప్రియమైన వారికి బహుమతులు అందించడం పెద్ద టాస్క్. ఎందుకంటే ఏ బహుమతి ఇవ్వాలనే విషయంలోనే ఎటూ తేల్చుకోలేక రోజులను గడిపేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేకుండా ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఈజీగా బహుమతి తీసుకోవచ్చు. మీ ప్రియమైన వారి వ్యక్తిగత వివరాలు, గిఫ్ట్ ఇస్తున్న సందర్భం మొదలగు వివరాలు అందిస్తే వాళ్ళకు సరిపోయే గిఫ్ట్ ని మీకు చూపిస్తుంది. చాక్లెట్స్, పువ్వులు మొదలైన వాటిని బహుమతులుగా ఇవ్వడం మానేసారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడం తేలిక. కావాల్సిన వాళ్ళు ఎక్కడున్నా అక్కడికి గిఫ్ట్ ఆర్డర్ చేసేయొచ్చు. అదీగాక ఇప్పుడు ముఖ్యమైన తేదీలను ప్రత్యేకించి గుర్తుంచుకోవాల్సిన పని కూడా లేదు. ఫేస్ బుక్ తో పాటు క్యాలెండర్ కూడా గుర్తు చేస్తుంది.
సెర్చ్ చేసిన దాని ప్రకారం సజెషన్స్
తేదీని గుర్తు చేయడమే కాకుండా, ఆ కాలంలో ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, ఏ ఏజ్ వాళ్లకి ఎలాంటి గిఫ్ట్ సెట్ అవుతుందన్న సమాచారాన్ని ప్రిఫరెన్స్ లో చూపిస్తుంటుంది. దానివల్ల మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మీకు నచ్చిన గిఫ్ట్ వివరాలు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా సేవ్ చేసి ఉంటాయి. చివరి సంవత్సరం ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారని మళ్ళీ మీకు గుర్తు చేస్తుంటుంది ఏఐ. కొన్నిసార్లు సెర్చ్ లో గిఫ్ట్ ల గురించి వెతికితే వాటి అడ్వర్టైజ్ మెంట్స్ విపరీతంగా వస్తుంటాయి. ఇదంతా ఏఐ మహిమే. ఏఐ వల్ల మనిషి పని సులువు అవుతుందని కొందరు సంబరపడితే, మనిషి చివరకు ఏమవుతాడో అని కొందరు ఆందోళన పడుతున్నారు.