Page Loader
Hibiscus Tea: షుగర్ రాకుండా ఉండాలంటే ఈ టీ తాగండి
Hibiscus Tea: షూగర్ రాకుండా ఉండాలంటే ఈ టీ తాగండి

Hibiscus Tea: షుగర్ రాకుండా ఉండాలంటే ఈ టీ తాగండి

వ్రాసిన వారు Stalin
Mar 10, 2024
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

Benifits of Hibiscus Tea: మందార పువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో తయారైన రెడ్ కలర్ టీని ప్రతిరోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా మందార టీని తాగడం వల్ల ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా, భవిష్యత్‌లో వచ్చే కొన్ని దీర్ఘకాలిక రోగాలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. మందార టీ రుచి తీపి, పుల్లని మేళవింపుతో ఉంటుంది. ఈ టీని తయారు చేయడానికి మందార రేకులను ఉపయోగిస్తారు. ఇది హెర్బల్ ఒక టీ. బెర్రీస్ రంగును పోలి ఉంటుంది.

టీ

మందార టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

1. షుగర్‌ను నిరోధిస్తుంది మందార టీలో గ్లూకోసిడేస్, అమైలేస్ వంటి ఎంజైమ్‌లను నిరోధించే పాలీఫెనాల్స్ ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఎంజైములు కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 2. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది మందార టీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందని చెబుతున్నారు. మందార టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దీనికి కారణం కావచ్చు. మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.

టీ

3. క్యాన్సర్‌తో పోరాటం

2011లో నిర్వహించిన ఒక అధ్యయనంలో మందార పువ్వులతో తయారు చేసిన టీ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పోరాడుతుందని తేలింది. ఇందులో ఉండే కాటెచిన్స్ వంటి పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. పాలీఫెనాల్స్ ప్రోస్టేట్ కణితులను నిరోధించవచ్చు. క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేస్తాయి. ప్రతిరోజూ మందార టీతో మీ రోజును ప్రారంభించడం ద్వారా, మీరు క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలను తగ్గించుకోవచ్చు. 4. బరువు తగ్గడానికి.. మందార టీలో ఆంథోసైనిన్, సైనిడిన్, డెల్ఫినిడిన్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి బరువును తగ్గించగలవు. ఈ టీ గ్యాస్ట్రిక్, ప్యాంక్రియాటిక్ లిపేస్ ఎంజైమ్‌లను నిరోధిస్తుంది. ప్రతిరోజూ కాఫీకి బదులుగా మందార టీని మీ ఆహారంలో చేర్చుకుంటే మీరు సులభంగా బరువు తగ్గగలుగుతారు.