టాన్సిల్లిటిస్ నుండి ఉపశమనం అందించే ఇంటి చిట్కాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
గొంతు వెనక భాగంలో ఉండే టాన్సిల్స్ లో వచ్చే వాపు, నొప్పులను టాన్సిల్లిటిస్ అంటారు. చాలాసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల టాన్సిల్లిటిస్ వస్తుంది. అలాగే బాక్టీరియా కారణంగా కూడా ఈ ఇబ్బంది కలుగుతుంది.
టాన్సిల్ నొప్పి మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ ని సంప్రదించడంలో ఆలస్యం అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించండి.
ఉప్పునీళ్ళతో పుక్కిలింత:
నొప్పి మరీ తీవ్రంగా ఉంటే ఉప్పునీళ్ళు బాగా పనిచేస్తాయి. గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి బాగా కలిపి నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా రోజుకు ఐదారు సార్లు చేస్తే బాగుంటుంది.
గోరు వెచ్చని నీళ్ళలో మాత్రమే ఉప్పు కలుపుకుని తాగాలి.
Details
తులసి ఆయిల్ తో టాన్సిల్లిటిస్ మాయం
యాపిల్ సైడర్ వెనిగర్:
ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో రెండు చెంచాల యాపిల్ సైడర్ వేసుకుని బాగా కలిపి తాగాలి. యాపిల్ సైడర్ వెనిగర్ రుచి మీకు నచ్చకపోతే పుక్కిలించినా సరిపోతుంది. ఇలా రోజుకు మూడు సార్లు చేయాలి.
తులసి:
గోరు వెచ్చని తులసి నీళ్ళను రోజులో కనీసం నాలుగైదు సార్లు తాగాలి. లేదంటే తులసి టీ తాగినా సరిపోతుంది. ఇంకా తులసి ఆయిల్ ని గొంతు, ఛాతికి మర్దన చేస్తే ఫలితం ఉంటుంది.
తులసి ఆకులను బాగా మరిగించి ఆవిరి పట్టుకున్నా కూడా మంచి ఉపశమనం దొరుకుతుంది.
మెంతులు:
వీటిని రాత్రంతా నానబెట్టి పొద్దున్న ఆ మెంతులను వడకట్టి, రోజుకు మూడుసార్లు పుక్కిలించాలి.