కిడ్నీలో రాళ్ళ సమస్య నుండి ఉపశమనం అందించే యోగాసనాలు
వయసుతో సంబంధం లేకుండా కిడ్నీలో రాళ్ళ సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం,కావాల్సినన్ని నీళ్ళు తాగకపోవడం, అధిక బరువు,జీర్ణ సమస్యల వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. రాళ్ళ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ ను సంప్రదించడం మంచిది. అయితే డాక్టరుతో పాటు అదనంగా యోగాసనాలు వేస్తే మరింత ఉపశమనం కలుగుతుంది. ఎలాంటి ఆసనాలు రిలీఫ్ కలిగిస్తాయో చూద్దాం. భుజంగాసనం: నేలమీద బోర్లా పడుకుని అరచేతులను నేలమీద ఆనించి, గాలిని లోపలికి పీల్చుకుంటూ నడుము భాగాన్ని మాత్రం పైకి లేపాలి. కొంతసేపు అలాగే ఉండి ఆ తర్వాత గాలిని వదిలేస్తూ సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
కిడ్నీ రాళ్ళ సమస్యకు ఉపశమనం అందించే యోగాసనాలు
ఉష్ట్రాసనం: మోకాళ్ళ మీద కూర్చుని నడుముకు చేతులను పెట్టి, వెనక్కి వంగండి. ఈ ప్రాసెస్ లో మీ ముఖం, సీలింగ్ ని చూస్తుండాలి. ఆ తర్వాత నడుము మీది నుండి చేతులను తీసివేసి కాలి మడమలను చేతివేళ్లతో పట్టుకోండి. ఇలా కొద్దిసేపు ఉండండి. పవన ముక్తాసనం: నేలమీద వెల్లకిలా పడుకుని కాళ్ళను మోకాళ్ళ వరకు మడిచి రొమ్ము వైపు తీసుకురండి. ఇప్పుడు మోకాళ్ళను చేతులతో గట్టిగా పట్టుకోండి. ఆ తర్వాత మీ మెడను నేలమీద నుండీ పైకి లేపి మోకాళ్ల మధ్యలో ఉంచండి. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం మాయమైపోతుంది. అంతేకాదు మూత్రపిండంలోని రాళ్ళ సమస్య నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.