చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారి పరిస్థితిని బాగు చేసే యోగాసనాలు
ఈ వార్తాకథనం ఏంటి
యోగాసనాలు వేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు మీ ఆరోగ్యాన్ని మరింత పరిపుష్టం చేసుకోవడానికి యోగసనాలు ప్రయత్నించండి. ప్రస్తుతం డయాబెటిస్ తో బాధపడే వారి పరిస్థితుని బాగుచేసే యోగాసనాలేంటో చూద్దాం.
ఈ ఆసనాల వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
పశ్చిమోత్థాసనం:
కాళ్ళను ముందుకు చాపి కూర్చుని చేతులతో పాదాలను పట్టుకోవాలి. లేదంటే కాలిమడమలను పట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నడుమును నెమ్మదిగా వండి మోకాళ్ళ మీద తలను ఆనించాలి.
అధోముఖ స్వనాసనం:
కాళ్ళ మధ్య స్పేస్ తీసుకుని నిటారుగా నిలబడి నెమ్మదిగా వంగండి. చేతులను నేలమీద ఉంచుతూ వీ షేప్ మాదిరిగా శరీరం కనిపించేలా వంగాలి. మీ నడుమును ఎంత పైకి లేపగలరో లేపండి. కొన్ని నిమిషాల తర్వాత రిలాక్స్ అవ్వండి.
డయాబెటిస్
డయాబెటిస్ ఇబ్బందిని తగ్గించే యోగసనాలు
బాలాసనం:
మోకాళ్ళ మీద కూర్చుని కాలి మడమల మీద పిరుదులను ఆనించండి. ఇప్పుడు నడుము పై భాగాన్ని నెమ్మదిగా కిందకు వంచుతూ తొడలకు ఛాతిని తగిలేలా వంగాలి. చేతులకు తలకు సమాంతరంగా ముందుకు చాచాలి.
హలాసనం:
వెల్లకిలా యోగా మ్యాట్ మీద పడుకుని కాళ్ళను నెమ్మదిగా పైకి లేపండి. అలా పైకి లేపుతూ, మీ తల వెనక భాగంలో పాదాలను ఆనించండి. మీ చేతులను నేలమీదే ఉంచండి. ఇలా ఒక 30సెకన్లు ఉంచిన తర్వాత రిలాక్స్ అవ్వండి.
ధనూరాసనం:
బోర్లా పడుకుని నెమ్మదిగా ఛాతి భాగాన్ని పైకి లేపాలి. మరోవైపు కాళ్ళను వెనక్కి విరిచి చేతులతో కాళ్ళను పట్టుకోవాలి. ఈ ఆకారం చూడడానికి ధనుస్సులా ఉంటుంది.