యోగాసనాలు వేయడం కష్టంగా ఉందా? వీల్ యోగా ట్రై చేయండి
చక్రంతో యోగా గురించి మీరెప్పుడూ విని ఉండరు. కానీ ఇది నిజం. చక్రం సాయంతో యోగాసనాలు వేయడమే వీల్ యోగా. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. వీల్ యోగాను ఎవరు చేయవచ్చు: యోగాను కొత్తగా మొదలు పెట్టిన వారు కూడా వీల్ యోగాను చేయవచ్చు. ఈ రకం యోగాను అథ్లెట్స్ ఎక్కువగా చేస్తుంటారు. బాడీ టెన్షన్ తగ్గడానికి, శరీర కణాలు అభివృద్ధి చెందడానికి వీల్ యోగాను చేస్తారు. లాభాలు: కొత్తగా మొదలుపెట్టిన వారికి ఆసనాలు వేయడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వీల్ ని ఆధారం చేసుకుని యోగాసనాలు ఈజీగా వేయవచ్చు. వీల్ తో వెనక్కి వంగడం, శరీరాన్ని మలుపులు తిప్పడం సులభం.
నొప్పులను, గాయాలను దూరం చేసే వీల్ యోగా
గాయాలు కాకుండా చూసుకుంటుంది: యోగా చేస్తున్నప్పుడు సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వల్ల కొన్ని ఆసనాలు చేసే సమయాల్లో గాయాలవుతాయి. చక్రం సపోర్ట్ కారణంగా గాయాలయ్యే అవకాశం తగ్గిపోతుంది. నొప్పులను దూరం చేస్తుంది: కొన్ని యోగాసనాల్లో శరీరం నొప్పులకు గురయ్యే అవకాశం ఉంది. దానివల్ల రోజంతా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వీల్ తో చేసే యోగా వల్ల ఈ నొప్పులు కలగవు. శరీరం మరింత వంపులు తిరుగుతుంది: వీల్ ని బేస్ చేసుకుని యోగా చేసే టైమ్ లో, సాధారణంగా చేసే దానికన్నా ప్రభావ వంతంగా యోగాసనాలు చేయవచ్చు. ఈ లాభం వల్ల శరీర కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. దాంతో మీ సామర్థ్యం పెరుగుతుంది, బలంగా తయారవుతారు.