LOADING...
Heath tips : పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా?.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?
పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా?.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?

Heath tips : పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా?.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 07, 2026
03:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక యువతి మెదడులో సూక్ష్మజీవుల కారణంగా నీటితో నిండిన గడ్డలు ఏర్పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె తరచుగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం, సరిగా శుభ్రం చేయని, పూర్తిగా ఉడకని క్యాబేజీ తినడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కూరగాయలను పచ్చిగా లేదా సగం ఉడికించి తినడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం అవసరం.

వివరాలు

వాటిలో పోషకాలు మెండు..

సలాడ్లు లేదా ఫాస్ట్ ఫుడ్ ఏదైనా తీసుకున్నా, వాటిలో కూరగాయలు భాగమవుతాయి. అందుకే పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా? వాటిలో ఏవి తినాలి? ఏవి దూరంగా పెట్టాలి? అనే సందేహాలు చాలామందిలో కనిపిస్తాయి. కొందరు దీనిపై జాగ్రత్తగా ఆలోచిస్తే, మరికొందరు అవగాహన లేకుండా అలాగే తీసుకుంటుంటారు. పచ్చి కూరగాయలు కొన్ని పోషకాలను అందిస్తాయి అనేది నిజమే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో అవి ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సరైన అవగాహన అవసరం.

వివరాలు

పచ్చి కూరగాయలు తినడం వల్ల కలిగే సమస్యలు

జీర్ణ సంబంధ సమస్యలు: ముడి కూరగాయల్లో అధికంగా ఉండే గట్టి ఫైబర్ కారణంగా అవి సులభంగా జీర్ణం కావు. ఎక్కువగా తీసుకుంటే కడుపునొప్పి, ఎసిడిటీ, గ్యాస్ వంటి ఇబ్బందులు రావచ్చు. సహజ విషపదార్థాలు: కొన్ని కూరగాయల్లో సోలనిన్ వంటి సహజంగా ఉండే విషపదార్థాలు ఉంటాయి. వండినప్పుడు ఇవి తగ్గిపోతాయి. బ్యాక్టీరియా, పరాన్నజీవులు: సరిగా శుభ్రం చేయని పచ్చి కూరగాయల్లో ఈకోలి వంటి హానికర బ్యాక్టీరియా లేదా నులిపురుగుల గుడ్లు ఉండే అవకాశం ఉంది. ఇవి శరీరంలోకి వెళ్లి ఇన్‌ఫెక్షన్లు కలిగించవచ్చు.

Advertisement

వివరాలు

పచ్చిగా తినకూడని కూరగాయలివే..

బంగాళాదుంప, వంకాయ, క్యాప్సికం, బ్రోకలి, క్యాలీఫ్లవర్, పాలకూర, కొన్ని చిక్కుడు జాతి కూరగాయలను పచ్చిగా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి బంగాళాదుంపలో ఉండే సోలనిన్ తలనొప్పి, వాంతులు, ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతుంది. వంకాయలో ఉన్న చేదు పదార్థాలు అజీర్ణానికి దారితీస్తాయి. పచ్చి టమాటాలో ఉండే టొమాటిన్ జీర్ణక్రియను దెబ్బతీసి పోషకాల శోషణను తగ్గిస్తుంది. పచ్చి బచ్చలకూరలో ఉన్న ఆక్సాలిక్ యాసిడ్ వల్ల క్యాల్షియం, ఐరన్ శరీరానికి సరిగా అందవు. క్యాబేజీలో నులిపురుగులు, వాటి గుడ్లు ఉండే అవకాశం ఉంది. ఇవి కంటికి కనిపించకపోవచ్చు. కాబట్టి వండే ముందు వేడి నీటిలో బాగా కడిగి పూర్తిగా ఉడికించి తీసుకోవాలి. పచ్చి క్యాబేజీలో ఉన్న అధిక ఫైబర్ జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారిలో విరేచనాలకు కారణమవుతుంది.

Advertisement