హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియజేసే టిప్స్, ఆడవాళ్ళకు మాత్రమే
ఈ వార్తాకథనం ఏంటి
హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా రంగులతో నిండిపోతుంది. అయితే రంగులతో ఆడేటపుడు మీరు వేసుకున్న డ్రెస్ మీకు సౌకర్యంగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలో హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్న ఆడవాళ్ళకు ఇదే మా సలహా.
చికాంకారి సల్వార్ సూట్:
పండగ రోజు ఈ సల్వార్ సూట్ సరిగ్గా సరిపోతుంది. వైట్ కలర్ లోని సల్వార్ సూట్ లో అందంగా కనిపించడమే కాకుండా, దానిమీద పడిన రంగులు కూడా అందంగా కనిపిస్తాయి.
హోళీ
హోళీ రోజు ఆడవాళ్ళకు ఎలాంటి డ్రెసెస్ బాగుంటాయంటే
పొడుగాటి షర్ట్ డ్రెస్:
షర్ట్ మాదిరిగా ఉండే పొడుగ్గా ఉండే షర్ట్ డ్రెస్, హోళీకి సరిగ్గా సరిపోతుంది. మీకు నచ్చిన రంగులో డ్రెస్ తీసుకుని బెల్ట్ పెట్టుకుని రెడీ అవ్వండి. అంతేకాదు, మ్యాచింగ్ షూస్, చెవి రింగులు ఉంటే మరింత లుక్ వస్తుంది.
మెరిసే చీర:
పండగ పూట చీరను మించిన డ్రెస్ ఇంకోటి ఉండదు. వైట్ కలర్ సారీలో బ్రైట్ కలర్ బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ గా ఉంటుంది. ఫ్యామిలీ అందరూ హోళీలో పాల్గొంటున్నప్పుడు సారీ సరిగ్గా సరిపోతుంది.
క్రాప్ షర్ట్, షార్ట్:
మీ ఫ్రెండ్స్ తో హోళీని ఎంజాయ్ చేయాలనుకుంటే క్రాప్ షర్ట్, దాని మీదకు షార్ట్ సౌకర్యంగా ఉంటుంది. షార్ట్ నచ్చకపోతే కొంచెం పొడుగాటి స్కర్ట్ ధరించండి.