
ఫ్యాషన్: పెళ్ళిళ్ళ సీజన్ లో ఇలాంటి స్టైలిష్ బ్లౌజెస్ ని మీ బీరువాలో ఉంచుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. ఇప్పటి నుండి మొదలు పెడితే వేసవి పూర్తయ్యే వరకూ అన్నీ మంచి రోజులే కాబట్టి పెళ్ళిళ్ళు, శుభకార్యక్రమాలు జరుపుకోవడం ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి టైమ్ లో ఆడవాళ్ళందరూ చీరలను సెలెక్ట్ చేసే పనిలో పడతారు. ఏ శుభకార్యానికి ఎలాంటి చీర కట్టుకోవాలనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారికోసం అందమైన బ్లౌజ్ డిజైన్ లను ని పరిచయం చేస్తున్నారు డిజైనర్ సుజాత.
వి నెక్ బ్లౌజెస్: మీ వార్డ్ రోబ్ లో వి నెక్ బ్లౌజెస్ తప్పక ఉండాలని సుజాత సూచిస్తుంది. వి నెక్ బ్లౌజ్ కారణంగా మీ ముఖం కొనదేలినట్టు, కోలగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నెక్లెస్ వేసుకుంటే మరింత బాగుంటుంది.
ఫ్యాషన్
పెళ్ళిళ్ళ సీజన్ కోసం డిజైనర్ బ్లౌజెస్
హాల్తేర్ టై రివర్సిబుల్ బ్లౌజెస్: ఇలాంటి బ్లౌజెస్, ఎలాంటి చీరల మీదికైనా సెట్ అవుతాయి. లెహంగా ధరించినపుడు కూడా సెట్ అవుతాయి.
పఫ్ స్లీవ్ బ్లౌజ్: ఫ్యాషన్ అనేది సర్కిల్ లాంటిది. పాతకాలం నాటి స్టైల్స్ మళ్ళీ తిరిగి కొత్తగా వస్తున్నాయి. అలా మీరు ట్రై చేయాలనుకుంటే పఫ్ స్లీవ్ బ్లౌజ్ ట్రై చేయండి.
బ్రోకేడ్ బ్లౌజ్: సాంప్రదాయ బద్దంగా కనిపించాలంటే బ్రోకేడ్ బ్లౌజ్ డిజైన్ బాగుంటుందని డిజైనర్ సుజాత చెబుతున్నారు. కాంచీవరం పట్టు చీరలకు బ్రోకేజ్ బ్లౌజ్ సరిగ్గా సరిపోతుందని ఆమె సూచిస్తున్నారు.
ప్రింటెడ్ కాటన్ బ్లౌజెస్: వచ్చేది వేసవి కాబట్టి సౌకర్యంగా, సింపుల్ గా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కాటన్ బ్లౌజెస్ బెటర్ అని సుజాత చెబుతున్నారు.