మద్యాహ్నం నిద్ర మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తోందా? ఈ పనులు చేసి చూడండి
కొందరికి మద్యాహ్నం అన్నం తినగానే నిద్రొచ్చేస్తుంటుంది. ఇంకొందరికి అలసటగా అనిపిస్తుంటుంది. దానివల్ల మీ పనులు మీరు సరిగ్గా చేసుకోలేకపోతారు. అందుకే దాన్నుండి బయటపడే మార్గాలు తెలుసుకుందాం. బ్రేక్ ఫాస్ట్ చేయండి: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మిస్ అయితే మద్యాహ్నం పూట ఎక్కువ తినాల్సి వస్తుంది. ఫలితంగా శరీరం సోమరిగా మారుతుంది. సో, బ్రేక్ ఫాస్ట్ చేయడం మర్చిపోవద్దు. మంచి పోషాకాలున్న ఆహారాలను బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోండి. ఆకు కూరలు, కూరగాయలు, మొలకలు మొదలగు వాటిని తినండి. నీళ్ళు ఎక్కువగా తాగండి: కావాల్సినన్ని నీళ్ళు తాగకపోతే శరీర జీవక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా మీరు బద్దకంగా తయారవుతారు. మద్యాహ్నం అలసటగా అనిపించినపుడు గ్లాసు వాటర్ తాగుతూ ఉండండి.
మద్యాహ్నపు అలసటను పోగొట్టే కొన్ని టిప్స్
పని నుండి కొంచెం పక్కకు జరగండి: అలసటగా అనిపించినపుడు చేసే పని పక్కన పెట్టి శరీరానికి మెదడుకు విశ్రాంతినివ్వాలి. దానివల్ల మెదడు మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఎండలో నిలబడండి: మద్యాహ్నం నిద్రొచ్చినట్లు మీకనిపిస్తే వెంటనే అక్కడి నుండి లేచి ఎండలో నిలబడండి. ఎండవేడి వల్ల మీ నిద్ర దూరమవుతుంది. ఎండలో విటమిన్ డి కూడా దొరుకుతుంది. సరిగ్గా నిద్రపోండి: రాత్రిళ్ళు మీకు నిద్ర సరిగ్గా నిద్ర లేకపోతే మద్యాహ్నం పూట నిద్రొస్తుంటుంది. విశ్రాంతి లేకుండా శరీరం పనిచేయదు. సగటు మానవుడికి రోజులో కనీసం 6 నుండి 8గంటల నిద్ర అవసరం. రాత్రి తొందరగా నిద్రపోయి పొద్దున్న తొందరగా నిద్ర లేవండి. మీ నిద్రగడియారాన్ని డిస్టర్బ్ చేసుకుంటే డైలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది.