Holi 2025: హోలీ పండుగ సమయంలో నీటిని ఆదా చేసే చిట్కాలు
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ పండుగ మన ఆనందాన్ని పెంచే రంగుల పండుగ. కానీ, ఈ సందర్భంగా ఎక్కువ నీటిని వృథా అవ్వడం సాధారణంగా కనిపిస్తుంది.
నీటి ప్రాముఖ్యతను గుర్తించి, ఈ హోలీ పండుగను నీరు ఆదా చేస్తూ ఎలా ఆనందంగా జరుపుకోవచ్చో తెలుసుకుందాం.
పొడి రంగులు (Dry Colors): సాంప్రదాయక పొడి రంగులు (పొడి గులాల్, ఆకుపచ్చ రంగులు, మొదలైనవి) వాడండి. నీరు లేకుండానే ఈ రంగులను వాడవచ్చు కాబట్టి నీటి వృధాను అరికట్టవచ్చు.
ఆర్గానిక్ కలర్స్ (Organic Colors): సింథటిక్ రంగుల బదులు ఆర్గానిక్ రంగులను వాడటం మంచిది. ఇవి సులభంగా రంగులను తొలగించగలవు.. అంతేకాకుండా వీటికి నీరు తక్కువగా వాడవలసిన అవసరం ఉంటుంది.
వివరాలు
నీరు ఆదా చేసే చిట్కాలు
నీటి వినియోగాన్ని తగ్గించుకోవడం: హోలీ సమయంలో నీటిని ఎక్కువగా వృధాగా ఉపయోగించకుండా అవసరమైన మేరకే వాడాలి.
పాత దుస్తులు ధరించడం: మురికిని తొలగించడానికి మళ్ళీ ఉతికే అవసరం లేకుండా, పాత దుస్తులను ధరించడం మంచిది.
స్నానానికి తగినంత నీరు ఉపయోగించడం: హోలీ తరువాత స్నానం చెయ్యడానికి కూడా అవసరమైనంత నీరు మాత్రమే ఉపయోగించాలి, వృధాగా పోకుండా చూసుకోవాలి.
నీటిని ఆదా చేయటం కోసం మీ స్నేహితులు, బంధువులతో కలిసి ఈ చిట్కాలను ప్రయత్నించండి.