Holi 2026: హోలీ వేడుకల్లో థండాయి స్పెషల్.. ఈ 5 ఫ్లేవర్స్ తప్పక ట్రై చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ పండుగ అంటే రంగులు, సందడి మాత్రమే కాదు... ప్రత్యేకమైన వంటకాలూ గుర్తుకు వస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది థండాయి. రంగుల పండుగగా పేరుగాంచిన హోలీ వసంతఋతువు ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో చల్లగా,రుచిగా ఉండే థండాయి తాగడం ఒక సంప్రదాయంగా మారింది. పాలు, డ్రై ఫ్రూట్స్, సుగంధ దినుసులతో తయారయ్యే ఈ పానీయం శరీరానికి తేజస్సు ఇచ్చేలా ఉంటుంది. హోలీ రోజున కుటుంబ సభ్యులు,స్నేహితులు కలిసి పండుగను జరుపుకుంటూ మిఠాయిలతో పాటు థండాయి తాగడం ఆనవాయితీగా కొనసాగుతోంది. చాలా ప్రాంతాల్లో "హోలీ మిలన్" అనే కార్యక్రమాల్లో సంగీతం,ఫాగ్ పాటలు,కవిత్వంతో పాటు థండాయి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
వివరాలు
ఇంట్లో సులభంగా చేసుకునే ఐదు రకాల థండాయి రెసిపీలు
కొందరు సంప్రదాయం ప్రకారం భాంగ్ కలిపిన థండాయి కూడా తయారు చేస్తారు. అతిథులకు ఒక గ్లాస్ థండాయి ఇవ్వడం ఆతిథ్యానికి, ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. ఈ హోలీ సందర్భంగా ఇంట్లో సులభంగా చేసుకునే ఐదు రకాల థండాయి రెసిపీలు ఇప్పుడు చూద్దాం.
వివరాలు
క్లాసిక్ కేసర్ బాదం థండాయి
తయారికి కావాల్సిన పదార్ధాలు: బాదం, సోంపు, గసగసాలు, మెలన్ గింజలు, మిరియాలు, యాలకులు, కుంకుమపువ్వు, చక్కెర, చల్లటి పాలు ముందుగా బాదం, సోంపు, గసగసాలు, మెలన్ గింజలను 3-4 గంటలు నీటిలో నానబెట్టాలి. తర్వాత బాదం తొక్క తీసి మిరియాలు, యాలకులతో కలిసి మెత్తగా పేస్ట్ చేయాలి. గ్రైండ్ చేసే సమయంలో కొద్దిగా పాలు, కుంకుమపువ్వు కలపాలి. ఈ పేస్ట్‌ను చల్లటి పాలలో వేసి చక్కెర కలిపి బాగా కలపాలి. అరగంట ఫ్రిజ్‌లో పెట్టి, తర్వాత వడకట్టి బాదం ముక్కలు, కుంకుమపువ్వుతో అలంకరించి చల్లగా సర్వ్ చేయాలి.
వివరాలు
రోజ్ థండాయి
తయారికి కావాల్సిన పదార్ధాలు: థండాయి పేస్ట్, చల్లటి పాలు, రోజ్ సిరప్, అవసరమైతే చక్కెర, ఎండిన రోజా రేకులు. పాలు, థండాయి పేస్ట్ కలిపి బాగా కలపాలి. అందులో రోజ్ సిరప్ వేసి రుచి చూసి తీపి సరిపడేలా చేసుకోవాలి. 20-30 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక రోజా రేకులు, పిస్తా ముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి.
వివరాలు
చాక్లెట్ థండాయి
తయారికి కావాల్సిన పదార్ధాలు: థండాయి, చల్లటి పాలు, కోకో పొడి లేదా కరిగించిన డార్క్ చాక్లెట్, చక్కెర ముందుగా కోకో పొడిని కొద్దిగా వెచ్చని పాలలో కలిపి గడ్డలు లేకుండా చేయాలి లేదా చాక్లెట్ కరిగించాలి. తర్వాత దీన్ని థండాయి, చల్లటి పాలతో కలిపి బాగా కలపాలి. 20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టి చాక్లెట్ తురుము, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి చల్లగా వడ్డించాలి.
వివరాలు
మ్యాంగో థండాయి
తయారికి కావాల్సిన పదార్ధాలు: తాజా మామిడి గుజ్జు, థండాయి పేస్ట్, చల్లటి పాలు, చక్కెర ముందుగా మామిడి గుజ్జును మెత్తగా బ్లెండ్ చేయాలి. తర్వాత థండాయి పేస్ట్‌ను చల్లటి పాలలో కలిపి అందులో మామిడి గుజ్జు వేసి మళ్లీ కొద్దిగా బ్లెండ్ చేయాలి. తీపి సరిపడేలా చూసుకుని బాదం ముక్కలు చల్లి చల్లగా సర్వ్ చేయాలి.
వివరాలు
కొబ్బరి థండాయి
తయారికి కావాల్సిన పదార్ధాలు: థండాయి పేస్ట్, చల్లటి పాలు, కొబ్బరి పాలు, తాజా తురిమిన కొబ్బరి, చక్కెర చల్లటి పాలు, కొబ్బరి పాలు, థండాయి పేస్ట్ కలిపి అందులో తురిమిన కొబ్బరి వేసి కొంచెం సేపు బ్లెండ్ చేయాలి. సరిపడా చెక్కర కలుపుకొని 30 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత వేయించిన కొబ్బరి తురుముతో అలంకరించి చల్లగా వడ్డిస్తే రుచికరమైన కొబ్బరి థండాయి సిద్ధం అవుతుంది.