Holi special: హోలీ స్పెషల్.. తెలంగాణ పల్లెల్లో కాముడు ఆటకు వెనుక కారణాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ పల్లెల్లో 'కాముడ' సందడి మొదలైంది. కాముడు కాముడు వలలో, కాముడకచ్చినం వలలో.. రింగు రింగు బిల్ల రూపాయి దండ అంటూ మగ పిల్లలు కట్టెలతో కోలలు తయారు చేసుకొని, ఒకరి చేతిలో సంచి పట్టుకుని, ఇంటింటికి తిరుగుతూ కాముడ పాట పాడుతూ తొమ్మిది రోజుల పాటు ఆట ఆడుతారు. ఇక ఆడపిల్లలు మల్లె చెట్టుకి దిగి, 'మదనోన వయ్యారి' అంటూ చేతులతో చపట్లు కొట్టుకుంటూ కాముడ ఆటలో పాల్గొంటారు.
Details
హోలీ పండుగతో ప్రత్యేక సంబంధం
ప్రతి ఒక్కరి ఇష్టమైన పండుగల్లో హోలీ ఒకటి. అందమైన రంగుల, స్నేహితులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే హోలీ దేశవ్యాప్తంగా ఒక్కరోజే జరుగుతుంది. కానీ తెలంగాణలో హోలీకి సంబంధించిన కాముడ ఆట తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. చిన్నపిల్లల సమూహాలు, పాటలు, సంపాదన తొమ్మిది రోజుల పాటు పల్లెల్లో పిల్లలు ఐదు నుంచి ఆరుగురు ఒక గుంపుగా చేరి కాముడ ఆట ఆడతారు. అందమైన జానపద గేయాలు పాడుతూ, బియ్యం, ధాన్యం, డబ్బులు సేకరిస్తారు. పల్లెల్లో సందడి, పెద్దవారి పాల్గొనడం తొమ్మిది రోజుల పాటు పల్లెల్లో సందడి నెలకొంటుంది. పెద్దవారు కూడా చిన్నపిల్లలతో పాటలు పాడుతూ హోలీ పౌర్ణమి వరకు ఈ ఆటలో ఆనందాన్ని పొందుతారు.
Details
సంప్రదాయం, తరాల పరంపర
చివరి రోజున పిల్లలు సేకరించిన ధాన్యం, డబ్బులను పంచి, హోలీ ఆటలు ఆడతారు. ఈ రోజు పెద్దవారు కూడా కాముడ ఆటలో పాల్గొంటారు. జాజిరి ఆట ఆడటానికి వెనుక అనేక కథలు ఉన్నాయి. తరతరాలుగా తెలంగాణలో ఈ సంప్రదాయం కొనసాగుతూ ప్రతి ఒక్కరు ఆనందంగా కాముడ ఆటను ఆడతారు.