LOADING...
Diabetes cure: చైనాలో సంచలనం… స్టెమ్ సెల్ థెరపీతో టైప్-2 డయాబెటిస్‌కు చెక్!
చైనాలో సంచలనం… స్టెమ్ సెల్ థెరపీతో టైప్-2 డయాబెటిస్‌కు చెక్!

Diabetes cure: చైనాలో సంచలనం… స్టెమ్ సెల్ థెరపీతో టైప్-2 డయాబెటిస్‌కు చెక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

టైప్-2 డయాబెటిస్‌ను స్టెమ్ సెల్ థెరపీతో పూర్తిగా నియంత్రించగలిగామని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. శరీరంలో ఇన్సులిన్ పని చేసే విధానాన్ని కాపీ చేసేలా ఆరోగ్యకరమైన ప్యాంక్రియాస్ కణాలను మార్పిడి చేయడం ద్వారా ఈ ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. ఈ విధానంతో చికిత్స పొందిన రోగి ఇకపై ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేదా మందులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించగలుగుతున్నాడని వెల్లడించారు. సాధారణంగా టైప్-2 డయాబెటిస్ వచ్చినప్పుడు శరీరం ఇన్సులిన్‌ను సరిగా ఉపయోగించలేకపోతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అప్పుడు రోగులు ఇన్సులిన్ లేదా ఇతర మందులు వాడాల్సి వస్తుంది. ఒకసారి ఇన్సులిన్‌పై ఆధారపడితే మళ్లీ సహజ స్థితికి రావడం చాలా కష్టమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలుగా స్టెమ్ సెల్స్

అయితే చైనా పరిశోధకులు మొదటగా రోగి లేదా దాత నుంచి స్టెమ్ సెల్స్ తీసుకుని,వాటిని ప్రత్యేక రసాయన,జన్యు సంకేతాల ద్వారా ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలుగా మారుస్తారు. తర్వాత వాటిని ఆరోగ్యకరమైన కణజాలంలా సమూహాలుగా పెంచి, రోగి శరీరంలో.. ఎక్కువగా కడుపు భాగంలో.. మార్పిడి చేస్తారు. ఈ కణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల మార్పులను గుర్తించి అవసరమైనప్పుడు ఇన్సులిన్ విడుదల చేస్తాయి.

వివరాలు 

ఆశలు రేపుతున్న కొత్త పరిశోధన

అయితే ఈ కణాలను శరీరం అంగీకరిస్తుందా లేదా తిరస్కరిస్తుందా అన్నది చికిత్స ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశం. మార్పిడి తర్వాత వైద్యులు రోగిని నిరంతరం పరిశీలిస్తూ కొత్త కణాలు సరిగ్గా పనిచేస్తున్నాయా, ఇమ్యూన్ సమస్యలు వస్తున్నాయా అనే విషయాలను గమనిస్తారు. మొత్తం మీద స్టెమ్ సెల్ ఆధారిత ఈ చికిత్స భవిష్యత్తులో డయాబెటిస్ రోగులకు దీర్ఘకాలిక, వ్యక్తిగత పరిష్కారం చూపించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement