Loading...
Pesara pakodi recipe: ఇంట్లో హోటల్ స్టైల్‌లో స్నాక్స్.. పెసర పకోడీలు, టేస్టీ గ్రీన్ చట్నీ రెసీపీ ఇదే!
ఇంట్లో హోటల్ స్టైల్‌లో స్నాక్స్.. పెసర పకోడీలు, టేస్టీ గ్రీన్ చట్నీ రెసీపీ ఇదే!

Pesara pakodi recipe: ఇంట్లో హోటల్ స్టైల్‌లో స్నాక్స్.. పెసర పకోడీలు, టేస్టీ గ్రీన్ చట్నీ రెసీపీ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2026
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ అడగడం సహజం. అయితే బయట దుకాణాల్లో దొరికే ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాటి తయారీకి ఏ నూనెలు వాడుతారో, పదార్థాలు ఎప్పుడు తయారు అయ్యాయో మనకు తెలియదు. అందువల్ల, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంట్లోనే సింపుల్‌గా 'పెసర పకోడీలు' చేసుకోవడం ఉత్తమం. ఈ పకోడీలు పిల్లలకు ఇష్టమైనవే కాకుండా, తినడంలో మజా కూడా కలిగిస్తుంది.

Details

కావలసిన పదార్థాలు

పొట్టు పెసరపప్పు - 1 కప్పు

పచ్చిమిర్చి - 3

ఉల్లిపాయ - 1

జీలకర్ర - 1 స్పూన్

ధనియాలు - 1 టేబుల్ స్పూన్

అల్లం తరుగు - కొద్దిగా

వెల్లుల్లి తరుగు - 5 ముక్కలు

కరివేపాకు - 3 రెమ్మలు

పుదీనా - కొద్దిగా

బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు

నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

Details

గ్రీన్ చట్నీ కోసం

పుదీనా - 1 చిన్న కట్ట

కొత్తిమీర - 1 చిన్న కట్ట

పచ్చిమిర్చి - 2

వెల్లుల్లి - 3

అల్లం - కొద్దిగా

పుట్నాలు - 1 టేబుల్ స్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

బెల్లం ముక్క - చిన్నది

జీలకర్ర పొడి - అర స్పూన్

చాట్ మసాలా - అర స్పూన్

నిమ్మరసం - అర చెక్క

పెరుగు - అర కప్పు

ADVERTISEMENT

Details

తయారీ విధానం

1. మొదట 1 కప్పు పొట్టు పెసరపప్పును ఓ గిన్నెలో 2 గంటల పాటు నానబెట్టు.

2. తర్వాత పప్పును రెండు-మూడు సార్లు శుభ్రం చేసి, గుప్పెడు మినహా మిగిలిన పప్పును మిక్సీలో గ్రైండ్ చేయాలి. మెత్తగా కాకుండా, కొర్స్‌గా గ్రైండ్ చేయడం ముఖ్యం. నీళ్లు పెట్టకుండా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోండి.

3. ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ధనియాలను చిన్న ముక్కలుగా దంచినది, అల్లం & వెల్లుల్లి తరుగు, కరివేపాకు, పుదీనా ఆకులు మొత్తం వేసి బాగా కలపండి.

4. పిండి జారుగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి కలపవచ్చు. ఇది పకోడీలను కరకరలాడటానికి సహాయపడుతుంది.

ADVERTISEMENT

Details

తయారీ విధానం1/2

5. మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత, స్టవ్‌పై కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి పకోడీల మాదిరిగా చిన్న ముక్కలు వేసి వేగించండి.

6. హై ఫ్లేమ్ వద్ద కాకుండా మీడియం ఫ్లేమ్‌లో వేయడం ద్వారా పకోడీలు లోపల నుండి బాగా వేగుతాయి. వేడి వేడిగా తినగానే పిల్లలు ఎన్ని తిన్నారో లెక్క తెలియదు!

గ్రీన్ చట్నీ తయారీ

మిక్సీలో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పుట్నాలు, ఉప్పు, బెల్లం ముక్క, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, పెరుగు మొత్తం వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. కావాలంటే కొద్దిగా నీళ్లు కూడా వేసి చట్నీ రెడీ చేసుకోవచ్చు.

ADVERTISEMENT