Beerakaya Alasandalu Curry : అన్నం, చపాతీలోకి సూపర్ కాంబినేషన్.. బీరకాయ,అలసందల కర్రీ
ఈ వార్తాకథనం ఏంటి
బీరకాయతో వివిధ రకాల కూరలు చేస్తాం. కానీ ఈ కర్రీ మాత్రం సూపర్ కాంబినేషన్.. బీరకాయ ముక్కలు, అలసందలతో చేసిన కర్రీ! ఇది వేడిగా అన్నంతో పాటు చపాతీలలో కూడా రుచిగా ఉంటుంది. కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు - 2 కప్పులు అలసందలు - అర కప్పు పచ్చికొబ్బరి ముక్కలు - పావు కప్పు ఉప్పు - రుచికి సరిపడా జీడిపప్పు - 10 గసగసాలు - 1 టీ స్పూన్ నూనె - 3 టేబుల్ స్పూన్లు ఆవాలు - అర టీ స్పూన్ జీలకర్ర - అర టీ స్పూన్ ఎండుమిర్చి - 2 కరివేపాకు - కొద్దిగా
వివరాలు
కావలసిన పదార్థాలు:
పచ్చిమిర్చి - 2 ఉల్లిపాయ తరుగు - అర కప్పు మిరియాల పొడి - అర టేబుల్ స్పూన్ పసుపు - పావు టేబుల్ స్పూన్ బెల్లం - అర టీ స్పూన్ కొత్తిమీర - కొంచెం
వివరాలు
తయారీ విధానం:
గిన్నెలో అర కప్పు అలసందలు, సరిపడా నీళ్లు వేసి రాత్రంతా నానబెట్టాలి.మళ్ళీ ఉదయం కుక్కర్‌లో నానబెట్టిన అలసందలు, కొద్దిగా ఉప్పు, రెండు కప్పుల నీరు కలిపి కుక్కర్ మూతపెట్టి మిడ్ ఫ్లేమ్‌లో ఆరు విజిల్స్ వరకు ఉడికించాలి. కావాల్సిన పరిమాణంలో బీరకాయ, ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేయాలి. గిన్నెలో పావు కప్పు పచ్చికొబ్బరి, 10 జీడిపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, కొద్దిగా నీరు కలపండి. 30 నిమిషాల పాటు నానబెట్టి, ఆ తర్వాత మిక్సీజార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరమైతే పావు కప్పు పాలు కూడా కలపవచ్చు.
వివరాలు
తయారీ విధానం:
కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి వేయించాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, అర కప్పు ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి కలిపి, మూత పెట్టి మగ్గించాలి. బీరకాయ మగ్గిన తరువాత ఉప్పు, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలి.
వివరాలు
తయారీ విధానం:
గ్రైండ్ చేసిన కొబ్బరి-జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి 4 నిమిషాల పాటు కలుపుతూ, నూనె మళ్లీ పైకి ఎగురే వరకు వేగనివ్వాలి. ఉడికించిన అలసందలను నీళ్లు సహా కడాయిలో వేసి, మిక్స్ చేసి మూత పెట్టి 12 నిమిషాల పాటు మిడ్ ఫ్లేమ్‌లో ఉడికించాలి. 12 నిమిషాల తర్వాత అర టీ స్పూన్ బెల్లం, కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.