Loading...
Saffron: నకిలీ కుంకుమపువ్వును ఎలా గుర్తించాలి? రంగు, సువాసన ద్వారా ఎలా తెలుసుకోవాలంటే? 
నకిలీ కుంకుమపువ్వును ఎలా గుర్తించాలి? రంగు, సువాసన ద్వారా ఎలా తెలుసుకోవాలంటే?

Saffron: నకిలీ కుంకుమపువ్వును ఎలా గుర్తించాలి? రంగు, సువాసన ద్వారా ఎలా తెలుసుకోవాలంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 14, 2024
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

కుంకుమపువ్వు, సుగంధద్రవ్యాల్లో అత్యంత విలువైనది. ప్రీమియం కావడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలకూ ప్రసిద్ధి చెందింది. అయితే దాని అరుదైన స్వభావం వల్ల కుంకుమపువ్వును నకిలీ చేయడం కూడా ఈ మధ్య ఎక్కవ అవుతోంది. కాబట్టి కుంకుమపువ్వు కొనేటప్పుడు ఇది నకిలీదా, అసలిదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిజమైన కుంకుమపువ్వు గుర్తించడం ఎలా? 1) రంగు అసలైన కుంకుమపువ్వు క్రిమ్సన్ లేదా డార్క్ రెడ్ కలర్‌లో ఉంటుంది. ఎర్రటి మెరూన్ రంగులో ఉండే ఈ కుంకుమపువ్వు, ఆరెంజ్ లేదా ఎల్లో షేడ్స్ ఉంటే నకిలీదని తెలుసుకోవాలి.

Details

2) సువాసన

అసలైన కుంకుమపువ్వు మట్టి వాసనతో పాటు కొద్దిగా తీపి సువాసనను ఇస్తుంది.

రుచి పక్కన పెడితే, కుంకుమపువ్వు వాసనతోనే నిజమైనదా కాదా అని తేల్చొచ్చు. సువాసనం రాకపోతే నకిలీ కుంకుమపువ్వగా గుర్తించాలి

3) ఆకృతి

కుంకుమపువ్వు పొడవుగా ఉండే స్టిగ్మా, దారంలాంటి ఆకృతిలో ఉంటుంది.

ఒక చివర మందంగా ఉండి, మరొక చివర సన్నగా ఉంటుంది. నకిలీలో విరిగిన లేదా అసంబద్ధమైన కళంకాలు ఉంటాయి.

4) మెరుపు

నిజమైన కుంకుమపువ్వును వెలుతురు వద్ద ఉంచితే అది కొద్దిగా మెరిసే గుణం కలిగి ఉంటుంది. నకిలీలో అలా ఉండదు.

5) రుచి

అసలైన కుంకుమపువ్వు కొంచెం చేదుగా, కాస్త కారంగా ఉంటుంది. చప్పగా లేదా తీపిగా ఉంటే అది నకిలీతని భావించాలి.

Details

కుంకుమపువ్వు కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి

నమ్మదగ్గ బ్రాండెడ్ కంపెనీల నుంచే కుంకుమపువ్వు కొనడం చాలా ఉత్తమం.

స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, FSSAI వంటి సంస్థల సర్టిఫికెట్లు ఉండే ప్రొడక్టులను మాత్రమే కొనాలి.

ఇక ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు ముఖ్యంగా రివ్యూలను పరిశీలించడం మంచిది.

ADVERTISEMENT