
Sleep: రాత్రి నిద్రకు భంగం కావొద్దంటే.. ఈ ఆహార అలవాట్లకు 'నో' చెప్పండి
ఈ వార్తాకథనం ఏంటి
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర తక్కువైతే శరీరంపై తీవ్రమైన ప్రభావాలు చూపుతుంది. అలసట, బద్ధకం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ ప్రస్తుత కాలంలో పనిబరువు, ఒత్తిడితో పాటు చెడు ఆహారపు అలవాట్ల వల్ల నిద్రలేమి అనేది సాధారణమైపోయింది. ముఖ్యంగా రాత్రిపూట కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నిద్ర భంగం కలుగుతుంది. అలాంటి వాటిని ఒక్కసారి చూద్దాం.
Details
బ్లాక్ టీ: మెదడును ఉత్సాహపరిచే కెఫిన్ ప్రభావం
బ్లాక్ టీ అంటే చాలామందికి ఇష్టం. తీపి లేకుండా తాగే ఈ టీ మెదడును మరింత చురుగ్గా చేస్తుంది. దీనిలోని కెఫిన్ మేల్కొలిపే ప్రభావాన్ని కలిగిస్తుంది. అందుకే పడుకునే ముందు దీనిని తాగడం వల్ల నిద్రను భంగం కలుగుతుంది డార్క్ చాక్లెట్: రుచికరమైన నిద్ర భంగి! డార్క్ చాక్లెట్ కూడా కెఫిన్‌ను కలిగి ఉంటుంది. దీనిని రాత్రివేళ తినడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. ముఖ్యమైన పని చేయాల్సిన సందర్భంలో మాత్రమే దీనిని తీసుకోవడం మంచిది.
Details
కాఫీ: నిద్రను అడ్డుకునే క్లాసిక్ డ్రింక్
కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపించే మెదడు గ్రాహకాలను నిరోధించి అప్రమత్తతను పెంచుతుంది. కనుక పడుకునే ముందు కాఫీ తాగడం వల్ల నిద్ర రాకపోవచ్చు. డెజర్ట్ కేక్: తీపి, కానీ నిద్రకు శత్రువు కాఫీ ఫ్లేవర్ కలిగిన డెజర్ట్ కేక్‌లు చాలా మందికి ఇష్టమైనవే. అయితే ఇందులో ఉండే కెఫిన్, చక్కెరల వల్ల శరీర ఉత్సాహం పెరిగి నిద్రలో అంతరాయం కలుగుతుంది. అర్థరాత్రి ఇలా తినడం వల్ల నిద్ర పూర్తిగా దెబ్బతింటుంది.
Details
గ్రీన్ చిల్లీ: శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది
పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం శరీర ఉష్ణోగ్రతను తాత్కాలికంగా పెంచుతుంది. ఇది శరీరానికి వేడిగా అనిపించడంతో పాటు నిద్ర రాకుండా చేస్తుంది. ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంటకు కారణమవుతుంది. నిద్ర అనేది ఆరోగ్యానికి అత్యంత కీలకమైన అంశం. కనుక రాత్రిపూట పై పదార్థాలన్నీ దూరంగా ఉంచడం ద్వారా మానసికంగా, శారీరకంగా విశ్రాంతినిచ్చే నిద్రను పొందవచ్చు. మంచి నిద్ర.. మంచీ ఆరోగ్యం!