Page Loader
Motivational: ఈ 8 లక్షణాలే ఉంటే.. జీవితంలో ఇకపై తిరుగే ఉండదు!
ఈ 8 లక్షణాలే ఉంటే.. జీవితంలో ఇకపై తిరుగే ఉండదు!

Motivational: ఈ 8 లక్షణాలే ఉంటే.. జీవితంలో ఇకపై తిరుగే ఉండదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2025
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

పురాణాల ప్రకారం, మహా భారతంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక అద్భుత రహస్యాలున్నాయి. మహాభారత కాలంలో మహా మేధావిగా, పాండవులను విజయతీరాలకే నడిపించిన వ్యక్తి విదురుడు. పాండు రాజు, ధృతరాష్ట్రుల సవతి సోదరుడైన విదురుడు కురు వంశ పితామహుడు భీష్మ మహారాజు దగ్గర శిక్షణ పొందాడు. అందుకే ఈయన గొప్ప మేధావిగా ఖ్యాతిని పొందాడు. ధృతరాష్ట్రుని పాలనలో మంత్రిగా విజయవంతంగా సేవలందించాడు. పాండవులకు, కౌరువులకు మధ్య జరిగిన అనేక చెడు సంఘటనలకు విదురుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నప్పటికీ, స్వయంగా ధర్మానికి కట్టుబడే జీవనాన్ని అనుసరించాడు.

Details

ప్రత్యేక గౌరవం లభిస్తుంది

నిజాయితీ, నీతిని పాటించే మహా దార్శనికుడిగా 'మహాత్మా' అని కూడా ప్రసిద్ధి చెందాడు. విదురుడు చెప్పిన ముఖ్యమైన విధానాలు నేటికీ మానవ మనుగడలో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మనం జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఉపయోగపడే ఎనిమిది ప్రత్యేక లక్షణాల గురించి ఆయన వివరించాడు. ఈ లక్షణాలను అనుసరించే వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తాయని విదురుడు నమ్మేవాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

Details

1. తెలివితేటల విషయంలో

తీక్షణమైన తెలివితేటలు ఉన్నవారే జీవితంలో ఎల్లప్పుడూ విజయాన్ని అందుకుంటారు. 2. గౌరవం విషయంలో సమాజంలో మనకున్న గౌరవం పూర్తిగా ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఆచితూచి మాట్లాడే వ్యక్తులను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు, ఇష్టపడతారు. అలాంటి వ్యక్తులకు అనేక సందర్భాల్లో ఇతరుల సహకారం లభిస్తుంది. 3. ఇంద్రియాలపై నియంత్రణ తన ఇంద్రియాలపై నియంత్రణ సాధించగల వ్యక్తే అన్ని రంగాల్లో విజయాన్ని అందుకుంటాడు. అలాంటి వ్యక్తులకు ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. 4. జ్ఞానం పంచుకోవడంలో జ్ఞానం ఎక్కువగా ఉన్న వ్యక్తులను అందరూ అంతగా ఇష్టపడకపోవచ్చు. కానీ ఆ జ్ఞానాన్ని అవసరానికి అనుగుణంగా పంచుకునే, ఇతరులకు మార్గదర్శకత్వం ఇచ్చే వ్యక్తులకు సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది.

Details

5. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడంలో 

పరిస్థితులను అర్థం చేసుకుని వాటిని అనుసరించి నడుచుకునే వ్యక్తులకు ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకోవడమే వ్యక్తి పరిపక్వతకు నిదర్శనం. 6. ధైర్యం విషయంలో తనలో ఉన్న శక్తిని సరియైన సమయంలో ఉపయోగించడం, నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం ఉన్నవారే సమాజంలో గౌరవాన్ని పొందగలరు. 7. దానధర్మాలు చేయడంలో సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, దానధర్మాలు చేసే వ్యక్తులకు ప్రజల మధ్య విశేష గౌరవం, మంచి పేరు లభిస్తుందని విదురుడు నమ్మేవాడు. 8. సహాయం చేయడంలో ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తులను ప్రజలు విశేషంగా గౌరవిస్తారు. ఇలాంటి వ్యక్తులకు ఎల్లప్పుడూ ప్రజల మద్దతు, ఆదరణ లభిస్తాయని విదురుడు తెలిపాడు.