NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది
    భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది

    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 03, 2025
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎప్పటికైనా భయం అనే భావన చుట్టుముట్టిన సందర్భాలు ఎదురవుతుంటాయి.

    "నాకా శక్తి లేదు", "వాళ్లంతా నన్ను నమ్మరు", "నేను ఓడిపోతానేమో" అనే సందేహాలు మన మనసులో పుట్టుకొస్తాయి.

    కానీ నిజమైన విజయం ఎప్పుడూ మొదలవుతుందంటే - అలాంటి భయాలను ఎదురించి, ఆ మొదటి అడుగును ధైర్యంగా వేసినప్పుడు మాత్రమే.

    ఇది ఒక చిన్న జింకపిల్ల అయిన జానకి కథ. తనపై నమ్మకం లేని చిన్న జింక ఎలా ధైర్యాన్ని అలవర్చుకొని, ఓ గొప్ప మార్పును సాధించిందో మనం తెలుసుకుందాం.

    ఎందుకంటే... జీవితం పరుగు పందెం కాకపోయినా, పోరాటానికి మాత్రం సిద్ధంగా ఉండాల్సిందే.

    వివరాలు 

    అడవిలో జానకి 

    ప్రకృతి సౌందర్యంతో నిండిన అడవిలో, జానకి అనే ఓ చిన్న జింకపిల్ల జీవించేది.

    ఆమెకు మెరిసే కళ్ళు, మృదువైన చర్మం ఉండేవి. కానీ పరిగెత్తే విషయంలో మాత్రం ఆమెకు భయం ఉండేది.

    మిగతా జింకలతో కలిసి ఆడాలని ఆమెకు ఆసక్తి ఉన్నా, అంత ధైర్యం లేక గుంపులో కలవకపోయేది.

    అడవిలోని మిగతా జింకపిల్లలు ఉదయం ఉదయం పరుగు పందెలు వేసుకుంటూ సరదాగా కాలక్షేపం చేసేవి.

    కానీ జానకి మాత్రం పక్కన నిల్చుని "నాకది రాదు", "నేను పడిపోతాను" అనే భయాలతో వెనకడుగు వేసేది.

    వివరాలు 

    జింకల గుంపు 

    ఒక రోజు,వృద్ధ జింక, జానకి అమ్మమ్మ, ఈ పరిస్థితిని గమనించింది. జానకిని దగ్గరకు తీసుకుని "నువ్వు ఎందుకు పరిగెత్తడం లేదు?" అని ప్రేమగా అడిగింది.

    జానకి కళ్లలో బాధతో "పడి పోతానేమోనన్న భయం ఉంది అమ్మమ్మ, అంతే కాదు మిగతా జింకలు నవ్వుతాయేమోనన్న సందేహం కూడా ఉంది" అని చెప్పింది.

    అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది - "ఎవరూ మొదటి ప్రయత్నంలోనే పడి పోకుండా పరిగెత్తలేదు. నిజంగా గొప్పవాళ్లు ఎవ్వరైనా పడిన తర్వాత లేచి మళ్లీ ప్రయత్నించేవారే. మన బలం మనం ఎంతసార్లైనా మళ్లీ లేచి నడవగలిగినప్పుడు తెలుస్తుంది" అని చెప్పింది.

    ఆ మాటలు జానకికి ఊరటనిచ్చాయి. లోపల ఓ చిన్న ధైర్యం ఆ పదాలతో మొదలైంది.

    వివరాలు 

    మొదటి ప్రయత్నం 

    కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం,జానకి మిగతా జింకలు ఆడుకుంటున్న సమయంలో చిన్నగా గెంతింది.

    తొలిసారి నెమ్మదిగా,ఎంతో జాగ్రత్తగా ఎగరడంతో గాలి జానకి చెవులకు తాకింది.కానీ, కాస్త తడబడి నేలపై పడిపోయింది.

    మళ్లీ ఎప్పటిలానే భయంతో ఏడుపొచ్చింది. కానీ వెంటనే అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

    "ఇప్పుడు పడినా, మళ్లీ లేచినవాళ్లే కదా గొప్పవాళ్లు!" అని తలుచుకుంది.

    మరింత ధైర్యంతో మళ్లీ లేచింది. ఈ సారి గెంతినప్పుడు కిందపడలేదు.

    రోజు రోజుకు ఆమె నడకలో అద్భుతమైన మార్పు వచ్చింది. తను పడినా, మళ్లీ లేచి పరిగెత్తడం నిత్యం జరిగే ప్రక్రియగా మారింది.

    కొన్ని రోజులకే ఆమె కాళ్లు బలంగా మారాయి. అంతకన్నా ముఖ్యంగా, ఆమె మనసులో భయం పూర్తిగా తగ్గిపోయింది.

    వివరాలు 

    పరుగు పందెం.. 

    కొన్ని వారాల తరువాత, అడవిలో ఓ పెద్ద పరుగు పోటీ నిర్వహించారు.

    అందరూ తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా చెప్పారు. జానకి మొదట భయపడింది.

    "నేను ఎలా పరిగెత్తగలను?" అన్న సందేహం మళ్లీ వచ్చి పడింది. కానీ వెంటనే అమ్మమ్మను అడిగింది - "అమ్మమ్మా, నేను ఈ పోటీలో గెలవగలనా?" అని.

    అమ్మమ్మ ఆనందంగా నవ్వి, "నీవు ఇప్పటికే భయాన్ని గెలిచావు. ఇప్పుడు మిగిలింది పరుగు కాదు, ధైర్యం చూపించడమే" అని స్పష్టంగా చెప్పింది.

    ఆ మాటలు జానకికి ఓ ఉత్సాహాన్ని ఇచ్చాయి.

    వివరాలు 

    చివరి వరకూ పరుగెత్తిన జానకి 

    పందెం మొదలైంది.మొదట జానకి నెమ్మదిగా పరిగెత్తింది. మిగతా జింకలు వేగంగా ముందుకు వెళ్లిపోయాయి.

    జానకి మాత్రం స్థిరంగా తన అడుగులు వేస్తూ ముందుకు సాగింది. మధ్యలో ఒకసారి తడబడింది, మరొకసారి కిందపడింది.

    కానీ ప్రతి సారి లేచి మళ్లీ ముందుకు పరిగెత్తింది. చివరకు జానకి పోటీ చివరి వరకూ పరిగెత్తి,తన పరుగు పూర్తి చేయగలిగింది.

    ఆమె గెలవలేకపోయినా, భయాన్ని జయించిందన్న విషయం అందరికీ స్పష్టమైంది.

    వివరాలు 

    చివరి వరకూ పరుగెత్తిన జానకి 

    అడవిలోని జంతువులంతా ఆమె ధైర్యానికి చప్పట్లు కొట్టాయి.

    "జానకి శబాష్!" అని పొగిడారు. ఎప్పుడూ పరుగు పెట్టలేని జానకి, అదే పరుగు పూర్తి చేయడం అనేది అందరికీ స్ఫూర్తిగా మారింది.

    జానకి పరుగు పూర్తి చేసింది. గెలుపు ఆమెది కాలేదేమో కానీ, భయాన్ని జయించినదే ఆమె నిజమైన విజయం.

    ఎందుకంటే విజయం అనేది ముగింపు స్థానం కాదు - అది మనం మొదలు పెట్టే ధైర్యంతోనే మొదలవుతుంది. ప్రయత్నించే మనసే మన విజయం కోసం మొదటి మెట్టు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ

    తాజా

    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్
     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌

    ప్రేరణ

    ప్రేరణ: రూపం లేని రేపటి గురించి ఆలోచించడం కన్నా నీ రూపం ఉన్న ఈరోజు గురించి ఆలోచించు  జీవితం
    ప్రేరణ: లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని లక్ష్యాన్ని వదులుకోవడం పిచ్చితనం  జీవితం
    ప్రేరణ: ఈ ప్రపంచాన్ని మార్చేది నీ చేతలే, నీ అభిప్రాయాలు కాదు  లైఫ్-స్టైల్
    ప్రేరణ: గమ్యం వైపు వెళ్ళే దారి ఎంత ఉత్సాహంగా ఉంటే అంత తొందరగా గమ్యాన్ని చేరుకుంటావ్  లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025